ETV Bharat / offbeat

ఎప్పుడూ ఫ్రెంచ్​ ఫ్రైస్​ బోర్​ - వెరైటీగా "బీట్​రూట్​ ఫ్రైస్"​ చేయండి - మళ్లీ మళ్లీ కావాలంటారు! - HOW TO MAKE BEETROOT FRIES AT HOME

-బీట్​రూట్​తో జ్యూస్​లు, లడ్డూలు మాత్రమే కాదు - ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైస్​ ట్రే చేయండి

How to Make Beetroot Fries at Home
How to Make Beetroot Fries at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 1:19 PM IST

How to Make Beetroot Fries at Home: సాయంత్రమైతే చాలు.. ఓ కప్పు వేడి వేడి టీతో పాటు ఏమైనా స్నాక్స్​ తినాలని ఆరాటపడుతుంటారు చాలా మంది. చలికాలంలో ఈ కోరిక ఎక్కువుంటుంది. అయితే ఈవెనింగ్​ స్నాక్స్​ అంటే అందరికీ సమోసా, పకోడి, మిక్చర్​ వంటివి గుర్తొస్తుంటాయి. అయితే ఇవే కాదు ఎన్నో రకాల రెసిపీలు సాయంత్రం స్నాక్స్​గా చేసుకోవచ్చు. అందులో "బీట్​రూట్​​ ఫ్రైస్​" కూడా ఒకటి. అదేంటి ఫ్రెంచ్​ ఫ్రైస్​ తెలుసు కానీ.. బీట్​రూట్​తో కూడా ఫ్రైస్​ ఉంటుందా అంటే.. ఉంటుంది. ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది చేయాలంటే ఏవేవో పదార్థాలు అవసరం లేదు. కేవలం ఇంట్లో లభించే అతి తక్కువ పదార్థాలతో రుచికరంగా చేసుకోవచ్చు. మరి బీట్​రూట్​ ఫ్రైస్​కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • బీట్​రూట్​ - 1
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 1 టీ స్పూన్​
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • గరం మసాలా - అర టీ స్పూన్​
  • మిరియాల పొడి - పావు చెంచా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టీ స్పూన్​
  • శనగపిండి - 2 టేబుల్​ స్పూన్లు
  • బియ్యప్పిండి - 2 టేబుల్​ స్పూన్లు
  • నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పచ్చిమిర్చి - 2

తయారీ విధానం:

  • ముందుగా బీట్​రూట్​ను చెక్కు తీసి పొడవుగా మందంగా కట్​ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని తడి లేకుండా ఆరబెట్టాలి.
  • ఇప్పుడు ఆరిన బీట్​రూట్​ ముక్కలను ఓ ప్లేట్​లోకి తీసుకుని అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి మసాలాలు ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి శనగపిండి, బియ్యప్పిండి వేసి మరో సారి వాటికి పట్టేలా బాగా కలిపి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి డీప్​ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి. ఆయిల్​ కాగిన తర్వాత స్టవ్​ను సిమ్​లో పెట్టి బీట్​రూట్​ ముక్కలను విడివిడిగా నూనెలో వేసుకోవాలి.
  • వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఓ నిమిషం పాటు వేయించిన తర్వాత గరిటెతో నెమ్మదిగా కలుపుతూ క్రిస్పీగా వేయించుకోవాలి.
  • ఇలా బీట్​రూట్​ మొత్తాన్ని చేసుకోవాలి. ఆఖరున కాగుతున్న నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసి బీట్​రూట్​ ముక్కల్లో కలుపుకోవాలి.
  • చివరకు బీట్​రూట్​ ఫ్రైస్​పై కాస్త చాట్​ మసాలా పొడి చల్లి తింటే సూపర్​గా ఉంటుంది. వీటిని డైరెక్ట్​గా తిన్నా లేదంటే పప్పు, సాంబార్​ వంటి వాటిల్లో సైడ్​ డిష్​కు అయినా కాంబినేషన్​ సూపర్​గా ఉంటుంది.
  • నచ్చితే మీరూ ఈ రెసిపీ ఓ సారీ ట్రై చేయండి.

క్రిస్పీ అండ్ టేస్టీ "గుమ్మడికాయ ఫ్రైస్" - సింపుల్​గా చేసుకోండిలా! - ఫ్రెంచ్ ఫ్రైస్​ కంటే ఈజీ!

ఫ్రెంచ్ ఫ్రైస్ బయట తింటున్నారా? - ఈ టిప్స్​తో ట్రై చేస్తే ఇంట్లోనే రెస్టరెంట్​ స్టైల్! - పైగా ఎంతో టేస్టీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.