IPL 2025 Schedule : క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ ఈ సారి కాస్త త్వరగానే అలరించనుంది. ఏటా ఏప్రిల్‌లో పలకరించే ఈ లీగ్ ఈ సారి మార్చిలోనే ప్రారంభం కానుంది. పలు క్రీడా ఛానళ్ల నివేదిక ప్రకారం మార్చి 14 నుంచి మే 25 వరకు 2025 సీజన్ పోటీలు జరగనున్నాయట. ఇక ఐపీఎల్ 2026 ఎడిషన్ మార్చి 15 నుంచి మే 31 వరకు, అలాగే ఐపీఎల్ 2027 సీజన్ మార్చి 14 నుంచి మే 30 వరకు జరుగుతాయంటూ పలు కథనాలు ప్రచురితమవుతున్నాయి. అయితే, వీటిపై ఐపీఎల్ కమిటీ లేదా బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఐపీఎల్ మాక్ వేలం - రూ. 8.5 కోట్లకు అశ్విన్‌ను ఏ జట్టు తీసుకుందంటే?
మరోవైపు సౌదీ అరేబియా వేదికగా రెండు రోజుల్లో ప్రతిష్టాత్మక ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ ఆక్షన్‌లో శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, చాహల్ వంటి భారత స్టార్లు ఉన్నారు. అయితే గత ఏడాది వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్‌ను ఆ ఫ్రాంచైజీ ఈ సారి రిటైన్ చేసుకోలేదు. దీంతో ఈ స్టార్ స్పిన్నర్‌ను ఏ జట్టు తీసుకుంటుందో అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తనకు తానుగా ఓ ఫ్రాంచైజీకి అమ్ముడైనట్లు అశ్విన్ పేర్కొన్నాడు. అయితే, ఇదంతా మాక్ వేలంలో కావడం గమనార్హం.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అశ్విన్ దాని ద్వారా పలు క్రికెట్ విషయాలపై స్పందిస్తుంటాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో డిబేట్‌లూ కూడా పెడుతుంటాడు. ఆసీస్‌తో తొలి టెస్టుకు ముందు షేర్ చేసిన వీడియోలో అశ్విన్ ఈ మాక్ వేలం నిర్వహించాడు. అందులో అతడ్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీసుకున్నట్లు వెల్లడించాడు. రూ.8.5 కోట్లకు సీఎస్కేకు అమ్ముడైనట్లు తెలిపాడు.
ఇక అశ్విన్ 2009 నుంచి 2015 వరకు చెన్నై జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత రైజింగ్ పుణె జట్టులోనూ ఆడాడు. 2017లో గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన అతడు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిపోయాడు. 2018లో కెప్టెన్‌గానూ బాధ్యతలు చేపట్టాడు. దిల్లీకి వెళ్లిన అశ్విన్ గత మూడు సీజన్లు రాజస్థాన్ జట్టుకు ఆడా ఆడాడు.
IPL 2025 మెగా వేలం ప్లేయర్ల ఫైనల్ లిస్ట్ ఇదే - మొత్తం ఎంత మంది అంటే?
ఐపీఎల్ ముందు అర్జున్ తెందూల్కర్ సంచలనం! - సచిన్ సాధించలేని ఆ రేర్ రికార్డ్ సొంతం