Rains in Telangana : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశాలున్నట్లు తెలిపింది. మరోవైపు బుధవారం నుంచి గురువారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 7.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటలో 5.6 సెం.మీ., కరీంనగర్ టౌన్లో 5.6, కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఎలుపుగొండలో 5.3 సెం.మీ. వర్షం కురిసింది.
తెలంగాణకు రెయిన్ అలర్ట్ - రాగల 3 రోజుల పాటు వర్షాలు
Published : Oct 18, 2024, 10:18 AM IST