ETV Bharat / state

గ్రూప్​ -2 రాత పరీక్షలు - టైం టేబుల్​ విడుదల చేసిన టీజీపీఎస్సీ - TSPSC GROUP 2 EXAM

డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్-2 పరీక్షలు - డిసెంబర్ 9నుంచి 15వరకూ హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం - అధికారిక ప్రకటన విడుదల చేసిన టీజీపీఎస్సీ

Telangana Group 2 Exam Dates
Telangana Group 2 Exam Dates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2024, 7:48 AM IST

Updated : Nov 22, 2024, 8:00 AM IST

Telangana Group 2 Exam Dates : రాష్ట్రంలో గ్రూప్​-2 సర్వీసుల పోస్టుల భర్తీకి డిసెంబరు 15,16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి హాల్​ టికెట్లు డిసెంబరు 9 నుంచి వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గ్రూప్​-2 పరీక్షకు సంబంధించిన సమగ్ర టైం టేబుల్​, సూచనలతో కూడిన వివరాలను టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో ఉంచారు. ప్రతి పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. అలాగే 150 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్షల తేదీ, సమయం : డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్​ -1 నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్​-2 జరగనుంది. అలాగే డిసెంబరు 16వ తేదీ ఇదే సమయాల్లో పేపర్​ 3,4 నిర్వహించనున్నారు.

పరీక్ష రాసే అభ్యర్థులకు నియమ- నిబంధనలు :

  • పరీక్ష ప్రారంభం అయ్యే సమయం కంటే అరగంట ముందే గేట్లు మూసివేస్తారు.
  • ఉదయం నిర్వహించే పరీక్షకు ఉదయం 9.30 గంటలు తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
  • అలాగే మధ్యాహ్నం నిర్వహించే పరీక్షకు 2.30 గంటల తరవాత అభ్యర్థులెవరనీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
  • అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్​ షీట్లు అందిస్తారు.
  • ఈ మేరకు ఓ నమూనా ఓఎంఆర్​ షీట్లు, సూచనలు వెబ్​సైట్​లలో పొందుపరిచారు.
  • పేపర్​-1 పరీక్ష రాసిన హాల్​ టికెట్​తోనే మిగతా పరీక్షలకు హాజరు కావాలి.
  • హాల్​ టికెట్​, ప్రశ్నపత్రాలు నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రపరచుకోవాలి. వాటిని అడిగినప్పుడు సమర్పించాలి.
  • అభ్యర్థులు ఓఎంఆర్​ షీట్​లో సమాధానాలు తప్పులు లేకుండా రాయాలి.
  • హాల్​టికెట్లు డిసెంబరు 9 నుంచి 15వ తేదీ వరకు డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.
  • తర్వాత ఎటువంటి డూప్లికేట్​ హాల్​టికెట్లు జారీ చేయరు.

సాంకేతిక సమస్యలు ఉంటే హెల్​లైన్​ నెంబరు : హాల్​టికెట్లు డౌన్​లోడ్​ చేసుకునే సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు కాల్​ చేయాలి. ఈ నంబర్లు కేవలం కమిషన్​ పనిదినాల్లో అంటే ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్​ చేయాలి. లేదా Helpdesk@tspsc.gov.in చిరునామాకు ఈ-మెయిల్‌ చేసిన సరిపోతుంది.

Note : టీజీపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ ద్వారా శాంపిల్​ ఓఎంఆర్​ షీట్​ను డౌన్​లోడ్​ చేసుకుని పరిశీలించుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్​సైట్​ నుంచి ఆ ఓఎంఆర్​ షీట్​ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. అసలైన ఓఎంఆర్​ షీట్​లో ఉండే నిబంధనలు ఇందులో ఉంటాయి. ఈ ప్రకటన టీజీపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ ద్వారా రిలీజ్​ చేయబడింది. డూప్లికేట్​ ప్రకటనలు చూసి మోసపోవద్దు.

ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితేనే గ్రూప్​-2 కొలువు మీదే - మరో 24 రోజులే సమయం

గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల - డిసెంబరులో ఎగ్జామ్స్​ - Telangana Group 2 Exam Dates

Last Updated : Nov 22, 2024, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.