national

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

ETV Bharat / snippets

సినీ నటుడు మంచు మోహన్​ బాబు ఇంట్లో దొంగతనం - రూ. 10 లక్షలు చోరీ

ACTOR MOHAN BABU
THEFT IN MOHAN BABU HOUSE (ETV Bharat)

Theft AT Actor Mohan Babu House in Hyderabad :సినీ నటుడు మంచు మోహన్‌బాబు నివాసంలో చోరీ జరిగింది. హైదరాబాద్ జల్​పల్లిలోని ఆయన నివాసంలో నిన్న(సెప్టెంబరు 24)న రాత్రి రూ.10 లక్షలు చోరీకి గురయ్యాయి.. ఇంట్లో పనిచేసే పని మనిషి నాయక్‌ దొంగతనం చేసినట్టు మోహన్‌బాబు రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉదయం కల్లా పనిమనిషి నాయక్‌ను పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. చోరీకి ఒక్కడే పాల్పడ్డాడా ఇంకా అతని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో కూడా ఫిల్మ్​ నగర్​లోని ఇంట్లో డబ్బులు, నగలు పనివారే దొంగిలించారు. మోహన్​ బాబు భారీ బడ్జెట్​తో తన తనయుడు మంచు విష్ణు హీరోగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details