ETV Bharat / offbeat

ఉత్తరాంధ్ర స్పెషల్​ "శివంగి పులుసు" - కనీసం ఒక్కసారైనా రుచి చూడాల్సిందే! - Uttarandhra Special Shivangi Pulusu

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Shivangi Pulusu: వంకాయతో చాలా రకాల వంటలు వండుతాటరు. మరి.. ఉత్తరాంధ్ర స్పెషల్ శివంగి పులుసు మీకు తెలుసా? మాంచి ఘాటుగా అద్దిరిపోతుంది. ఫుడ్ లవర్స్.. కనీసం ఒక్కసారైనా ఈ రుచిని ఆస్వాదించాల్సిందే. మరి.. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Shivangi Pulusu
Shivangi Pulusu (ETV Bharat)

How to Make Uttarandhra Special Shivangi Pulusu : "శివంగి పులుసు.." పేరు మాత్రమే కాదు టేస్ట్​ కూడా అద్దిరిపోతుంది. ఉత్త‌రాంధ్ర‌ సంప్ర‌దాయ‌పు వంట‌కమైన ఈ పులుసు.. తినే కొద్దీ తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, పుల్కా, రోటీ.. ఇలా ఏదైనా ఈ పులుసు చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ పులుసు ప్రిపేర్​ చేయాలంటే ఏవేవో పదార్థాలు అవసరం లేదు. కేవలం ఇంట్లో లభించే పదార్థాలతోనే నోరూరించే పులుసు రెడీ చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

మసాలా కోసం:

  • మినప గుండ్లు - ఒక చెంచా
  • పచ్చి శనగపప్పు - ఒక చెంచా
  • ధనియాలు - రెండు చెంచాలు
  • తెల్ల నువ్వులు - 2 చెంచాలు
  • బెల్లం ముక్క – చిన్నది
  • జీలకర్ర – 1 టేబుల్​ స్పూన్​
  • మెంతులు - అర చెంచా
  • ఆవాలు - 1 చెంచా
  • ఎండు కొబ్బరి ముక్కలు - 2 చెంచాలు
  • ఎండు మిరపకాయలు - 6
  • పల్లీలు - 2 చెంచాలు
  • చింతపండు - నిమ్మకాయ సైజంత
  • నీరు - తగినన్ని
  • గుత్తి వంకాయలు - 12
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - 3 చెంచాలు
  • పసుపు - 1 చెంచా

తాళింపు కోసం:

  • నెయ్యి - 3 చెంచాలు
  • ఆవాలు - 1 చెంచా
  • జీలకర్ర – 1 చెంచా
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ – చిటికెడు

మటన్​ ఎప్పుడూ కావొద్దు రొటీన్! - ఈ సారి దోసకాయ మటన్ కర్రీ చేయండి - సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు

తయారీ విధానం:

  • ముందుగా చింతపండును ఓ గిన్నెలోకి తీసుకుని కొన్ని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి పల్లీలు వేయించుకుని తీసుకోవాలి. అదే పాన్​లో ఎండు మిరపకాయలు, ఎండుకొబ్బరి ముక్కలను విడివిడిగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ధనియాలు దోరగా వేయించుకోవాలి. అలాగే పచ్చి శనగపప్పు, మినపప్పును కలిపి దోరగా వేయించుకుని తీసుకోవాలి.
  • అదే పాన్​లో తెల్ల నువ్వులు వేసి చిటపటలాడిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్​లోకి తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్​ చేసుకోవాలి. రోట్లో దంచుకుంటే రుచి మరింత బాగుంటుంది.
  • ఇప్పుడు ఓ గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని పసుపు, ఉప్పు వేసుకుని కరిగించుకోవాలి. ఆ తర్వాత అందులోకి గుత్తి వంకాయలకు నాలుగు గాట్లు పెట్టి కట్​ చేసుకోవాలి. కట్​ చేసుకున్న వాటిని పసుపు నీళ్లలో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేసి హీట్​ చేసుకోవాలి. అందులోకి కట్​ చేసుకున్న వంకాయలను వేసి కలిపి మూత పెట్టి ఓ నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి పసుపు వేసి కలిపి వెంటనే చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఆ తర్వాత ఓ గ్లాసు నీళ్లు పోసుకుని కలిపి మూత పెట్టి ఓ 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత మూత తీసి మరోమారు కలిపి ముందే ప్రిపేర్​ చేసుకున్న పొడిని కావాల్సినంత పరిమాణంలో తీసుకోవాలి. అంటే సుమారుగా 70 శాతం క్వాంటిటీలో తీసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని.. పులుపుకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు సరిపడా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కారం సరిపోకపోతే మిగిలిన పొడిని కొద్దిమేర కలుపుకోవచ్చు.
  • ఇప్పుడు మూత పెట్టి మరో మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పులుసు చిక్కబడిన తర్వాత దింపేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ మీద పాన్​ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి కలిపి దింపేసుకుని.. ఈ తాళింపును పులుసులో కలుపుకుంటే ఘుమఘుమలాడే ఉత్తరాంధ్ర స్పెషల్​ శివంగి పులుసు రెడీ!!

ఫిష్​ పులుసు పెట్టాలంటే చేపలే ఉండాలా ఏంటి? - వీటితో పులుసు పెడితే వహ్వా అనాల్సిందే!

మటర్ పనీర్ గ్రేవీని సింపుల్​గా చేసుకోండిలా - టేస్ట్ అద్దిరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.