Case Register on Children : పిల్లలు తెలిసి తెలియక చేసిన పనికి ఓ కానిస్టేబుల్ కర్కశంగా ప్రవర్తించాడు. తన కారుకు గీతలు పెట్టారనే కోపంతో ఏకంగా ఎనిమిది మంది చిన్నారులపై కేసు నమోదు చేశాడు. ఈ ఘటన హనుమకొండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ పట్టణంలోని రాంనగర్ టవర్‌లో ఓ ఫ్లాట్ల్‌లో కానిస్టేబుల్ నివాసం ఉంటున్నారు. కింద పార్కింగ్‌లో ఉంచిన తన కారుపై అపార్ట్‌మెంట్‌లోని పిల్లలు గీతలు గీశారని, గత నెల సుబేదారి ఠాణాలో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది పోయి, నేరుగా ఎనిమిది మంది పిల్లలపై కేసు నమోదు చేసి వివరాలను గోప్యంగా ఉంచారు. రెండు రోజుల క్రితం కేసుకు సంబంధించిన నోటీసులు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులను ఠాణాకు పిలవడంతో వెలుగులోకి వచ్చింది. తెలియక చేసిన పనిపై రెండు నుంచి తొమ్మిది సంవత్సరాల పిల్లలపై కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
కానిస్టేబుల్ దుశ్చర్య - కారుపై గీతలు గీశారని చిన్నారులపై కేసు నమోదు
Published : Sep 25, 2024, 10:54 AM IST