ETV Bharat / entertainment

'కంగువా' ట్విట్టర్ రివ్యూ- సూర్య పీరియాడికల్ డ్రామా ఎలా ఉందంటే? - KANGUVA TWITTER REVIEW

కంగువా ట్విట్టర్ - సూర్య పీరియాడికల్ డ్రామా ఎలా ఉందంటే?

Kanguva Twitter Review
Kanguva Twitter Review (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 6:59 AM IST

Kanguva Twitter Review : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్​ రోల్​లో తెరకెక్కిన సినిమా 'కంగువా'. శివ దర్శకత్వంలో ఇది పాన్ఇండియా లెవెల్​లో తెరకెక్కింది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్​గా నటించింది. గురువారం (నవంబర్ 14) వరల్డ్​వైడ్​గా ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. గురువారం ఉదయాన్నే పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి.

చాలా రోజుల తర్వాత సూర్య నుంచి వచ్చిన సినిమా కావడం వల్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ఇండియా మూవీ కావడం వల్ల తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో సూర్య స్వయంగా ప్రమోషన్స్​లో పాల్గొన్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా? కొత్త కాన్సెప్ట్​తో డైరెక్టర్ శివ సక్సెస్ అయ్యారా? ట్విట్టర్​లో టాక్ ఎలా ఉంది. తెలుసుకుందాం!

సూర్య 'కంగువా'కు పాజిటివ్​ టాక్ వినిపిస్తోంది. వీఎఫ్ఎక్స్​, గ్రాఫిక్స్ హై లెవెల్​లో ఉన్నాయని అంటున్నారు. సూర్య ఇంట్రడక్షన్​ బాగుందట. ఫస్ట్ సాంగ్ ఫ్యాన్స్​కు ఫీస్ట్​గా ఉంటుదని కామెంట్ చేస్తున్నారు. హీరో నటన సినిమాకు ప్లస్ పాయింట్​ అని టాక్ వినిపిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయిందని అంటున్నారు. శివ కొత్త కాన్సెప్ట్​తో ఆడియెన్స్​కు మంచి ఎక్స్​పీరియన్స్​ ఇచ్చారట.

కానీ, కథలో సస్పెన్స్​ కరవైంది. తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేస్తాం అంటున్నారు. హీరో, విలన్ మధ్య అనవరసర సీన్స్​ కూడా ఎక్కువయ్యాయని టాక్. అయితే ప్రీమియర్స్​ తర్వాత సోషల్ మీడియాలో మిక్స్​డ్ టాక్ వినిపిస్తోంది. మార్నింగ్ షో తర్వాత పర్ఫెక్ట్ రివ్యూ తెలిసిపోతుంది.

10వేల స్క్రీన్స్​
ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. 'కంగువా'ను 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నాం. వీటిలో చాలా స్క్రీన్లు ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యాయి. సౌత్​లో 2500 కంటే ఎక్కువ , నార్త్​లో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నామని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాం. నవంబర్‌ 14న మొత్తం 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకు రానుంది' అని నిర్మాత ధనుంజయ్‌ రిలీజ్​కు ముందు వెల్లడించారు.

కాగా ఈ సినిమా కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా సిద్ధమైంది. ఇందులో సూర్య ఆరు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. దాదాపూ రూ.300 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందింది. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ హీరోయిన్​గా నటించింది. బాబీ దేవోల్‌ కీలక పాత్ర పోషించారు. సీనియర్ నటుడు జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీడియాకు సారీ చెప్పిన సూర్య- ఎందుకంటే?

10,000 స్క్రీన్స్‌లో 'కంగువా' భారీ రిలీజ్​- సౌత్​లో ఎన్ని థియేటర్లంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.