Ind Vs Sa 3rd T20 2024 : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత్ రెండో విజయం నమోదు చేసింది. బుధవారం సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల భారీ ఛేదనలో సౌతాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 208-7 పరుగులకే పరిమితమైంది. మార్కో జాన్సెన్ (54 పరుగులు), హెన్రీచ్ క్లాసెన్ (41 పరుగులు) ఆకట్టుకున్నారు. టీమ్ఇండియా బౌలర్లలో ఆర్షదీప్ 3, వరుణ్ 2, హార్దిక్ పాండ్య, ఆక్షప్ పటేల్ తలో 1 వికెట్ దక్కించున్నారు. సెంచరీతో రఫ్పాడించిన తిలక్ వర్మకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
భారీ ఛేదనను సౌతాఫ్రికా దీటుగా ప్రారంభించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నారు. దీంతో 10 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులతో నిలిచింది. తర్వాత డేవిడ్ మిల్లర్ (18 పరుగులు) తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరినా, క్లాసెన్, జాన్సర్ రెచ్చిపోయారు. పోటీపడి మరీ సిక్స్‌లు బాదారు. ఈ క్రమంలో జాన్సన్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ క్రాస్ చేశాడు. ఇక ప్రమాదకరంగా మారిన ఈ ఇద్దర్నీ ఆఖర్లో అర్షదీప్ సింగ్ పెలియన్ చేర్చి భారత్ విజయం ఖరారు చేశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 219-6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి నిరాశ పర్చాడు. ఇదే సిరీస్‌లో రెండోసారి డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (50 పరుగులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1), కూడా విఫలమయ్యాడు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (107 పరుగులు, 56 బంతుల్లో; 8x4: 7x6) సూపర్ సెంచరీతో రప్ఫాడించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, సిమిలేన్ తలో 2, మార్కొ జాన్సెన్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య ఆఖరి వన్డే శుక్రవారం జరగనుంది.
For his match-winning Maiden T20I Century, Tilak Varma is adjudged the Player of the Match 👏👏
— BCCI (@BCCI) November 13, 2024
Scorecard - https://t.co/JBwOUChxmG#TeamIndia | #SAvIND | @TilakV9 pic.twitter.com/kvVhaYwOG7
తిలక్ వర్మ సూపర్ సెంచరీ - మూడో టీ20లో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం