ETV Bharat / technology

కళ్లు చెదిరే ఫీచర్లతో వివో సరికొత్త ఫోన్ లాంచ్- ధర ఎంతంటే? - Vivo V40e Launched - VIVO V40E LAUNCHED

Vivo V40e Launched: పండగల వేళ మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్​ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. తాజాగా కళ్లు చెదిరే ఫీచర్లతో వివో నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ అయింది. మరెందుకు ఆలస్యం దీని ధర, స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేద్దాం రండి.

Vivo V40e Launched
Vivo V40e Launched (Vivo)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 25, 2024, 2:09 PM IST

Updated : Sep 25, 2024, 2:43 PM IST

Vivo V40e Launched in India: దసరా, దీపావళి పండగల నేపథ్యంలో స్మార్ట్​ఫోన్లపై ప్రస్తుతం ఆఫర్ల జాతర నడుస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు అమెజాన్, ఫ్లిప్​కార్ట్ వంటి పలు సంస్థలు ఇప్పటికే భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే పలు స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థలు కొత్త కొత్త మోడల్స్​లో స్మార్ట్​ఫోన్లు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.

వివో వీ40ఈ పేరుతో దీన్ని ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేశారు. డ్యూయల్ కెమెరా సెటప్​తో వస్తున్న ఈ మొబైల్ కెమెరా ఫీచర్లను కూడా వివో కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు ఈ ఫోన్ 98 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 20 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్​ను అందిస్తుందని తెలిపింది. ఈ సరికొత్త స్మార్ట్​ఫోన్ డిజైన్ వివో వీ40ప్రో మొబైల్​ డిజైన్​ లానే ఉంది. ఈ సందర్భంగా వివో వీ40ఈ స్మార్ట్​ఫోన్ ధర, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు మీకోసం.

Vivo V40e ఫీచర్లు:

  • డిస్​ప్లే: 6.77 అంగుళాల 3డీ కర్వ్డ్
  • రిఫ్రెష్ రేట్: 120Hz
  • మందం: 0.749 సెంటీమీటర్లు
  • వెయిట్: 183 గ్రాముల బరువుతో స్లిమ్ ప్రొఫైల్
  • మెయిన్ కెమెరా: 50 మెగా పిక్సెల్
  • అల్ట్రావైడ్ కెమెరా: 8 మెగాపిక్సెల్
  • ఫ్రంట్ కెమెరా: 50 మెగాపిక్సెల్ ఐ-ఏఎఫ్ కెమెరా
  • సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్
  • 2ఎక్స్ పోర్ట్రెయిట్ మోడ్

Vivo V40e ఇతర ఫీచర్లు:

  • 8GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్
  • ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్
  • పీక్ బ్రైట్​నెస్: 4500నిట్స్
  • బ్యాటరీ: 5500 ఎంఏహెచ్
  • 8W ఫ్లాష్ ఛార్జ్
  • వెట్‌ టచ్‌ ఫీచర్‌
  • ఏఐ ఎరేజర్‌
  • ఏఐ ఫొటో ఎన్‌హాన్సర్‌
  • IP64 రేటింగ్‌
  • బ్లూటూత్ 5.4
  • యూఎస్‌బీ టైప్‌- సీ పోర్ట్‌

Vivo V40e స్మార్ట్​ఫోన్​లో కలర్ ఆప్షన్స్: ఈ సరికొత్త వివో వీ40ఈ స్మార్ట్​ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్​లో మార్కెట్లో అందుబాటులో ఉంది.

  • రాయల్ బ్రాంజ్
  • మింట్ గ్రీన్

Vivo V40e ధరలు:

8GB+ 128GB వేరియంట్ ధర: రూ.28,999

8GB+ 256GB వేరియంట్ ధర: రూ.30,999

ఆఫర్లు ఇవే:

  • అక్టోబర్ 2 నుంచి ఈ మోడల్ మొబైల్స్ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నట్లు వివో తెలిపింది.
  • ఫ్లిప్‌కార్ట్‌, వివో ఇ- స్టోర్‌తోపాటు వివో ప్రధాన స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది.
  • ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు 6 నెలల పాటు నో- కాస్ట్‌ EMI సదుపాయం అందించనుంది.
  • దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసేవారు 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ కూడా పొందొచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌- రూ.9,999లకే శాంసంగ్ మొబైల్! - Flipkart Offers on Samsung mobiles

పండగ వేళ మార్కెట్లోకి శాంసంగ్ కొత్త ఫోన్- ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! - Samsung Galaxy M55s 5G Launched

Last Updated : Sep 25, 2024, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.