ETV Bharat / business

రూ.25,000 కోట్ల హ్యుందాయ్‌ IPOకు సెబీ అనుమతి - ఈ మెగా ఇష్యూ డేట్ ఎప్పుడంటే? - Hyundai Motor India IPO - HYUNDAI MOTOR INDIA IPO

Hyundai Motor India IPO : హ్యుందాయ్‌ మోటార్‌ అనుబంధ సంస్థ 'హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా' ఐపీఓకు సెబీ అనుమతి లభించింది. అక్టోబరు నెలలో ఈ మెగా ఇష్యూ ఉండొచ్చని సమాచారం.

Hyundai Motor India IPO
Hyundai Motor India IPO (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 2:17 PM IST

Hyundai Motor India IPO : దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ అనుబంధ సంస్థ అయిన 'హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా' 3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.25,000 కోట్ల) పబ్లిక్‌ ఇష్యూ ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) అనుమతి ఇచ్చింది. ఈ అక్టోబరులోనే ఈ మెగా ఇష్యూ ఉండవచ్చని తెలుస్తోంది. 2022లో నమోదైన ఎల్‌ఐసీ 2.7 బిలియన్‌ డాలర్ల ఇష్యూ ఇప్పటి వరకు దేశీయంగా అతిపెద్ద ఐపీఓగా ఉండగా, ఇకపై హ్యుందాయ్‌ అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది. ఈ ఐపీఓ కోసం హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా విలువను 18-20 బిలియన్‌ డాలర్లుగా పరిగణించనున్నారు.

ఆఫర్ ఫర్ సేల్​
హ్యుందాయ్‌ మోటార్ ఇండియా ఐపీఓ మొత్తం 'ఆఫర్‌ ఫర్‌ సేల్‌' పద్ధతిలో జరగనుంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా మొత్తం 14,21,94,700 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అయితే ఫ్రెష్‌ షేర్ల జారీ ఉండదు.

1996లో భారత్‌లో కార్యకలాపాలు మొదలుపెట్టిన హ్యుందాయ్ మోటార్స్​ ప్రస్తుతం 13 మోడళ్లను విక్రయిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత స్టాక్‌ మార్కెట్లలోకి వస్తున్న తొలి వాహన కంపెనీ కూడా ఇదే కావడం గమనార్హం. 2003లో జపాన్‌ వాహన దిగ్గజం మారుతి సుజుకి ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైన సంగతి తెలిసిందే.

ఐపీఓల సందడి
ఇండియన్​ స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి కొనసాగుతోంది. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఆశించే ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఈ వారం ఏకంగా 11 ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కి వస్తున్నాయి. ఈ 11 కంపెనీల పబ్లిక్ ఇష్యూల విలువ రూ.900 కోట్లు వరకు ఉంటుందని అంచనా.

  • నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. ఈ సబ్​స్క్రిప్షన్​ సెప్టెంబర్ 23వ తేదీతో మొదలై 25వ తేదీతో ముగుస్తుంది. ధరల శ్రేణి రూ.114-120గా ఉంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఈ సంస్థ రూ.45.25 కోట్లు సమీకరించింది. ఇప్పుడు ఐపీఓ ద్వారా రూ.1.25 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.
  • కేఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్​ అండ్ రిఫ్రిజిరేషన్ కంపెనీ రూ.342 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 25 - 27 వరకు అందుబాటులో ఉంటుంది. ధరల శ్రేణి రూ.209-220గా ఉంది.
  • వోల్ 3డీ (Wol 3D) ఇండియా ఐపీఓ సెప్టెంబర్​ 23న మొదలై 25తో ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ రూ.142-150గా ఉంది.
  • రాపిడ్ వాల్వ్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.30.41 కోట్లు సమీకరించనుంది. ఇది సెప్టెంబర్ 23-25 మధ్య సబ్‌స్క్రిప్షన్‌కి వస్తోంది. ధరల శ్రేణి రూ.210-222గా ఉంది.
  • వీటితోపాటు టెక్ఎరా ఇంజినీరింగ్, థింకింగ్ హ్యాట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సొల్యూన్స్, యునిలెక్స్ కలర్స్ అండ్ కెమికల్స్ - ఐపీఓలు సెప్టెంబర్ 25న మొదలవుతాయి. సాజ్ హోటల్స్ ఐపీఓ ఈ సెప్టెంబర్ 27న ప్రారంభం అవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.