రాష్ట్రంలో భారీ వర్షాలు - 14 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - Heavy Rains In Telangana - HEAVY RAINS IN TELANGANA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2024, 7:38 PM IST

IMD Weather Report in Telangana : రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాలు కురిసే 14 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. పశ్చిమ - మధ్య బంగాళాఖాతం దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనం ఈ రోజు బలహీనపడినట్లు చెప్పారు. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ ఛత్తీస్​గఢ్ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందన్నారు.

Heavy Rains In Telangana : రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. హైదరాబాద్‌లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్‌ ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.