ETV Bharat / snippets

అమీన్​పూర్​లోని చెరువులు, పార్కుల్లో హైడ్రా సర్వే- కబ్జాదారుల్లో మొదలైన కలవరం

HYDRAA BEGINS DEMOLITIONS AMEENPUR
HYDRA IN AMEENPUR LAKE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2024, 5:16 PM IST

Hydra Survey in Ameenpur : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఆక్రమణలపై హైడ్రావిరుచుకుపడుతోంది. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది. తాజాగా అమీన్‌పూర్​లో పార్కులు ఆక్రమణకు గురయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేయగా, రెవెన్యూ సిబ్బంది సర్వే చేస్తున్నారు. చక్రపురి కాలనీ, పద్మావతి నగర్‌లో పార్కు స్థలాలు కబ్జాకు గురయ్యాయని కాలనీవాసులు హైడ్రాకమిషనర్‌ రంగనాథ్‌ అమీన్‌పూర్‌ వచ్చిన సమయంలో నేరుగా ఫిర్యాదు చేశారు.

దీంతో పార్కులు ఎక్కడ కబ్జా అయ్యాయో ఎవరు ఆక్రమించుకున్నారో తేల్చేందుకు సర్వే క్రతువు మొదలైంది. ఇప్పటికే చక్రపురి కాలనీకీ సమీపంలో సర్వేనెంబర్‌ 152, 153లో అధికారులు సర్వేను పూర్తిచేశారు. ఇక పద్మావతి నగర్‌లో సర్వేనెంబర్‌ 193, 194లో సర్వే చేస్తున్నారు. ఇది మరో రెండు రోజుల్లో పూర్తికానుందని అధికారులు తెలిపారు. మరోపక్క అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని నవ్యకూడలి వద్ద సర్వేనెంబర్ 1004​లో ఉన్న ఓ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు మున్సిపల్ అధికారులు దాన్ని పాక్షికంగా కూల్చివేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.