ETV Bharat / sports

ప్రైవేట్ పూల్, రూఫ్‌టాప్ బార్ - రింకు కొత్త ఇంట్లో ఏయే వసతులు ఉన్నాయంటే?

రింకూ సింగ్ నయా బంగ్లాలో ఏయే వసతులు ఉన్నాయో తెలుసా?

Rinku Singh New Bunglow
Rinku Singh (ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Rinku Singh New Bunglow : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్​ రింకూ సింగ్‌ ప్రస్తుతం మంచి ఫామ్​తో దూసుకెళ్తున్నాడు. తన బ్యాటింగ్​ స్కిల్స్​తో ఓ మంచి పవర్‌ హిట్టర్‌గా పాపులర్‌ అయ్యాడు. ఐపీఎల్​లో అద్భుతమైన పెర్ఫామెన్స్​తో అదరగొట్టి అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం టీమ్​ఇండియా టీ20 జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.

విలాసవంతమైన బంగ్లా కొన్న రింకూ
అయితే ఇటీవల ఐపీఎల్‌ రిటెన్షన్స్ ప్రకటించిన తర్వాత, రింకు తన సొంతింటి కలను నెరవేర్చుకున్నట్లు తెలుస్తోంది. అలీగఢ్​లోని ఓజోన్ సిటీలో ఉన్న గోల్డెన్ ఎస్టేట్‌లో రింకూ ఓ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు 500 చదరపు గజాల ఆ ఇల్లు ఖరీదు రూ.3.5 కోట్లుగా చెబుతున్నారు. ఆ ఇంట్లో ఒక రూఫ్‌టాప్ బార్, ప్రైవేట్ పూల్, అలాగే తను ఐదు సిక్సర్‌లు కొట్టిన బ్యాట్‌ని డిస్​ప్లే చేసేందుకు ఓ ప్రత్యేక స్థలం ఉందని సమాచారం. అయితే అంతకు ముందే అలీగఢ్​లోని ఓజోన్ సిటీలో 200-గజాల స్థలాన్ని, 100 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.

రింకూ సింగ్ క్రికెట్ జర్నీ ఎలా సాగిందంటే :
రింకూ సింగ్ జీవితం ఐపీఎల్‌ నుంచే మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్​ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన రింకూ సింగ్ చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. రూ.10 కోసం ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, క్రికెట్ పట్ల మక్కువ, కుటుంబాన్ని పోషించాలనే సంకల్పంతో ఈ స్థాయికి ఎదిగాడు. తన పవర్‌ హిట్టింగ్‌ సామర్థ్యంతో కీలక టీ20 ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అన్ని ఫ్రాంచైజీలు రిటైన్‌ చేసుకున్న మొత్తం 46 మంది ఆటగాళ్లలో 36 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 10 మంది ఆటగాళ్లు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కాగా, ఈ లిస్టులో అభిషేక్ పోరెల్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, హర్షిత్ రాణా, మొహ్సిన్ ఖాన్, ఆయుశ్​ బదోని, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, యశ్ దయాల్, రమణ్‌దీప్‌ సింగ్‌ ఉన్నారు.

'రిటెన్షన్స్​లో భారీ ధర- ​తండ్రికి కొత్త ఇల్లు, కారు గిఫ్ట్'- రింకూ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ

'కోహ్లీ బ్యాట్​ వల్ల నా ఇమేజ్ దెబ్బతింది - ఇకపై ఎవర్నీ బ్యాట్ ఆడగను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.