ETV Bharat / state

చిన్నారి గుండెలను కాపాడే ఆసుపత్రి - అక్కడ వారికి అన్నీ సేవలు ఫ్రీ..! - HEART CARE CENTER IN SIDDIPET

చిన్నారులను గుండెలను కాపాడే ఆసుపత్రి తెలంగాణలో ప్రారంభం - అక్కడ అన్ని సేవలు పూర్తిగా ఫ్రీ - సిద్దిపేటలో శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్‌ ఫర్‌ హార్ట్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్ ఆసుపత్రి ప్రారంభం

SRI SAI SANJEEVANI HEART CARE CENTER
Heart Care Center In Siddipet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 7:45 AM IST

Updated : Nov 15, 2024, 8:18 AM IST

Heart Care Center In Siddipet : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది గుండెకు సంబంధించిన సమస్యలతోనే మృతి చెందుతున్నారు. గుండె జబ్బులకు చిన్నా పెద్ద తేడాలు లేకుండా అర్థాంతరంగా ఆయుష్షు తీరిపోతుంది. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్దవారి వరకు గుండెలో అనేక సమస్యలతో అర్థికంగా మానసికంగా వారి బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ ఘటనలన్నింటికి పరిష్కార మార్గంగా ఆవిర్భవించిందే శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్‌ ఫర్‌ హార్ట్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రి. ఈ ఆస్పత్రిని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌, ఆసుపత్రి ఛైర్మన్‌ సీ.శ్రీనివాసులు ప్రాంభించారు.

శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్‌ ఫర్‌ హార్ట్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రి : సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్‌ ఫర్‌ హార్ట్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రిని ఛైర్మన్‌ సీ శ్రీనివాస్‌తో పాటు మాజీ క్రికెటర్, ఆసుపత్రి ట్రస్టీ సునీల్‌ గవాస్కర్‌ ప్రారంభించారు. చిన్నారులను గుండె జబ్బుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. తొలుత సత్యసాయి నిలయంలో సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని గవాస్కర్‌ పరిశీలించారు. ఆసుపత్రిలో చిన్నారులకు అందించే వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి వార్డులను పరిశీలించారు. గుండె శస్త్రచికిత్సలు చేయడానికి అధునాతన వైద్య పరికరాలను శ్రీ సత్యసాయి సంజీవిని సెంటర్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది.

దిల్‌ మాత్రమే ఉంటుంది బిల్‌ ఉండదు : క్రికెట్‌లో గెలవడానికి రెండో ఛాన్స్‌ ఉంటుందికానీ, జీవితంలో రెండో ఛాన్స్‌ అనే అవకాశం ఉండదని సునీల్‌ గవాస్కర్‌ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి సంజీవని చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. సంజీవని చిన్న పిల్లల ఆసుపత్రిలో కేవలం దిల్‌ మాత్రమే ఉంటుందని, బిల్‌ ఉండదని స్పష్టం చేశారు. వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్‌లో 200 స్కోర్‌ చేసినప్పుడు కూడా లభించని ఆనందం వారి తల్లిదండ్రులు ముఖాల్లో చూస్తామన్నారు.

పిల్లలు ఇక్కడి నుంచి వెళ్లాక మరో జన్మ ఎత్తినట్లు అవుతుంది. ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు నాకు మంచి అవకాశం వచ్చింది. ఎందుకు భాగస్వామ్యం అయ్యానంటే ఇంకో జన్మ ఎత్తిన పిల్లలు గుర్తుకు వచ్చినప్పుడు నా టెస్ట్‌ కెరీర్‌ ప్రారంభంలో తిరిగి పుంజుకున్న విషయాలు గుర్తుకు వస్తాయి. కెరీర్‌ ప్రారంభంలో రెండు సార్లు ఔట్‌ కాకుండా బయటపడ్డా. అందుకనే ఈ అవకాశం నాకు రాగానే రెండు చేతుల్తో అంది పుచ్చుకున్నా. ఏ పిల్లలు అయితే అనారోగ్యానికి గురై ఇబ్బందిపడతారో వారికి నయం చేసి మరో జన్మ ఇవ్వడం చాలా బాగుంటుంది.

చిన్నపిల్లల గుండె జబ్బుల ఆసుపత్రి : 2011లో శ్రీ సత్యసాయి బాబా సమాధి అయిన తర్వాత భారత ప్రభుత్వం సూచన మేరకు చిన్నపిల్లల గుండె జబ్బుల ఆసుపత్రిని తొలిసారిగా ఛత్తీస్‌ఘడ్‌లో ప్రారంభించినట్లు ఆసుపత్రి ఛైర్మన్‌ సీ శ్రీనివాస్‌ తెలిపారు. దేశంలో ఎక్కువ మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య గుండె జబ్బులని దీంతో చాలా మంది చిన్నారులు పుట్టిన తర్వాత మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. చిన్నారుల మరణాలను అరికట్టడానికి శ్రీ సత్యసాయి సంజీవని చిన్నపిల్లల ఆసుపత్రులు నాణ్యతతో కూడిన వైద్యం అందిస్తూ వివిధ ప్రాంతాల్లో నేటికీ దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాయని ఛైర్మన్‌ వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో కూడా అందుబాటులోకి వస్తే స్థానికంగా ఉన్న గిరిజన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు ఛైల్డ్‌ హార్ట్ కేర్‌ సెంటర్లు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌, హరియాణాలోని పల్వాల్‌, మహారాష్ట్రలోని నవీ ముంబయిలో ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా కొండపాకలో మరో కేంద్రం అందుబాటులోకి వచ్చింది. గత 12 ఏళ్లుగా 33 వేల 299 మంది శిశువులకు విజయవంతంగా గుండెకు సంబంధించిన సమస్యలను నయం చేయగలిగారు. దాదాపు 5 లక్షల 77 వేల 75 మంది చిన్నారులు ఔట్‌ పేషంట్లుగా సేవలు పొందారు. దేశంలోని దాదాపు 10 వేల గ్రామాల నుంచి రోగులు ఇప్పటికే సేవలు పొందారు. సత్యసాయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హరియాణా, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలల్లో ఐదు తల్లీ, పిల్లల ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో వైద్యం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. పేదలకు ఇలాంటి వైద్యం అందించడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతోంది.

ఏ వయసులో టెస్టులు చేయించుకుంటే రాబోయే రోగాలను కనిపెట్టవచ్చో తెలుసా?

"సైలెంట్​ హార్ట్​ ఎటాక్​" లక్షణాలివే - ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్​ అంటున్న నిపుణులు!

Last Updated : Nov 15, 2024, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.