ETV Bharat / entertainment

సూర్య పీరియాడికల్ డ్రామా - 'కంగువా' మూవీ ఎలా ఉందంటే?

సూర్య x బాబీ దేఓల్ - 'కంగువా' మూవీ ఎలా ఉందంటే?

Kanguva Review In Telugu
Kanguva Review In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

Kanguva Movie Telugu Review : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్​ రోల్​లో డైరెక్టర్ శివ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'కంగువా' . భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం గురువారం థియేటకర్లలో విడుదలైంది. మరీ ఈ ఎపిక్‌ ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌ ఎలా ఉందంటే?

స్టోరీ ఏంటంటే :
ఫ్రాన్సిస్ (సూర్య‌) గోవాలో ఓ బౌంటీ హంట‌ర్‌. పోలీసులు కూడా చేయ‌లేని ప‌నులను చేసి దానికి వాళ్ల నుంచి డ‌బ్బు తీసుకుంటుంటాడు. ఏంజెలా (దిశా ప‌టానీ)దీ కూడా ఇదే ప‌ని. ఒక‌ప్పుడు ఈ ఇద్దరూ లవర్సే. కానీ ఆ త‌ర్వాత విడిపోయి ఎవ‌రి దారులు వాళ్లు చూసుకుంటారు. అయితే ఫ్రాన్సిస్, త‌న స్నేహితుడు (యోగిబాబు)తో క‌లిసి ఓ బౌంటీ హంటింగ్ ప‌నిపై ఉన్న‌ సమయంలోనే జీటా అనే ఓ చిన్నారిని క‌లుసుకుంటారు. అతడ్ని క‌లుసుకోగానే ఈ ఇద్ద‌రికీ ఏదో తెలియ‌ని సంబంధం ఉన్న భావ‌న క‌లుగుతుంది ఫ్రాన్సిస్‌కు. అయితే ఒక సమయంలో ఆ బాలుడి ప్రాణాల‌కి ప్ర‌మాదం ఉంద‌ని తెలుసుకున్న ఫ్రాన్సిస్ ఆ చిన్నారిని కాపాడేందుకు ఎటువంటి సాహ‌సాలు చేశాడు? అస‌లు ఈ జీటాని వెంటాడుతున్నది ఎవ‌రు? జీటా, ఫ్రాన్సిస్‌, 1070 సంవ‌త్స‌రాల నాటి ప్ర‌ణవకోన యువ‌రాజు కంగువా (సూర్య‌)కి మ‌ధ్య సంబంధం ఏంటి? ఇటువంటి విష‌యాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే :
వెయ్యేళ్ల కింద‌టి ఓ జాన‌ప‌ద కథ‌ను, ఇప్పటి కాలానికి ముడిపెడుతూ తెర‌కెక్కించిందే 'కంగువా'. లార్జ‌ర్ దేన్ లైఫ్ అనే ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ఓ భారీ కాన్వాస్‌తో ఈ చిత్రం రూపొందింది. ఇటువంటి సినిమాలను తెర‌కెక్కించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ప్రేక్ష‌కుల్ని ఆ ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచంలో లీనం చేసి, తాము అనుకున్న క‌థ‌ని చెప్పాల‌నుకోవ‌డ‌మే. అయితే ఆ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించే క్ర‌మంలో ఇదివ‌ర‌కెప్పుడూ తెర‌పై చూడ‌ని నేప‌థ్యాన్ని, కొత్త విజువ‌ల్స్‌ను క‌ళ్ల‌కు కట్టినట్లు ఓ స‌రికొత్త వినోదం పంచే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఇక ఎమోషన్స్ అంటారా? అవి ఏ త‌రహా సినిమాకైనా చాలా అవ‌స‌ర‌మే. వెయ్యేళ్ల కింద‌టి ఫాంట‌సీ ప్ర‌పంచాన్ని ప‌క్కాగా ఆవిష్క‌రించి అందులోకి తీసుకెళ్ల‌డంలో డైరెక్టర్​ అలాగే మూవీ టీమ్ సక్సెస్ అయ్యింది. కానీ క‌థ‌ని చెప్పే విధానంలో డైరెక్టర్ కాస్త త‌డ‌బాటుకి గుర‌య్యారు. క‌థ‌ని ప్రెజెంట్​తో ముడిపెట్టే క్ర‌మంలో తొలి 20 నిమిషాల పాటూ సాగే సీన్స్ ప్రేక్ష‌కుడి స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తాయి త‌ప్ప‌, అవి ఏమాత్రం ఎఫెక్ట్ చూపించ‌వు.

ఇక కంగువా క‌థతోనే అస‌లు సినిమా మొద‌ల‌వుతుంది. అప్ప‌ట్నుంచైనా డైరెక్టర్ క‌థ‌పైన ప‌ట్టు చూపించాడా అంటే అదీ జ‌ర‌గ‌లేదు. ప్ర‌ణ‌వ‌కోన‌, క‌పాల కోన‌, సాగ‌ర కోన‌, అర‌ణ్య‌కోన‌, హిమ కోన అంటూ ఐదు వంశాలను ప‌రిచయం చేస్తూ ఓ గ‌జిబిజి వాతావ‌ర‌ణాన్ని సృష్టించారు. ఏ కోన‌తోనూ, మ‌రే వంశంపైనా ప్రేక్ష‌కులు ప్రేమ పెంచుకొనే అవ‌కాశం డైరెక్టర్ ఇవ్వ‌లేదు. ప్ర‌ణ‌వ కోన ఎటువంటిదో మాటల్లో చెప్పి వదిలేశారంతే. వాస్తవానికి ఈ క‌థ ప్ర‌ధానంగా ప్ర‌ణ‌వ కోన‌, క‌పాల కోన చుట్టూనే తిరుగుతుంది.

అందుకే ఆ రెండు వంశాల్నైనా పూర్తిగా ప‌రిచ‌యం చేసుంటే, సినిమాలోని పాత్ర‌లు ప్రేక్ష‌కులకు బాగా కనెక్ట్ అయ్యేవి. ప్ర‌తి పాత్ర బిగ్గ‌ర‌గా అరుస్తూ క‌నిపిస్తుంది త‌ప్ప‌ వాటి ఉద్దేశం, వాటి తాలూకు భావోద్వేగాలు ప్రేక్ష‌కుడి మ‌న‌సుని అంతగా తాక‌వు. ప్ర‌తి సినిమాను పోల్చి చూడ‌కూడ‌దు కానీ, 'కంగువా' క‌థ‌ల్ని చూసిన‌ప్పుడు 'బాహుబ‌లి' త‌ప్ప‌కుండా గుర్తొస్తుంది. 'బాహుబ‌లి' క‌థా ప్ర‌పంచం, పాత్ర‌లు ఆడియెన్స్​పై ఓ ప్ర‌త్యేక‌మైన ముద్ర వేస్తాయి. వాటితో ప్ర‌యాణం చేసేలా చేస్తాయి. ఈ సినిమాలో లోపించింది అదే.

ఇక 'కంగువా' క‌థ‌లో మాత్రం బ‌లం ఉంది. డైరెక్టర్ ఆలోచ‌న‌ల్లో ప‌దును క‌నిపిస్తుంది. కానీ ఆ ఐడియాలు తెర‌పైకి ప‌క్కాగా రాలేక‌పోయాయి. కంగువా, పుల‌వ నేప‌థ్యంలో వ‌చ్చే సీన్స్, ఆ రెండు పాత్ర‌ల మ‌ధ్య పండిన ఎమోషన్స్ ఈ సినిమాకి హైలైట్​గా నిలిచాయి. పుల‌వ కుటుంబం కోసం కంగువా నిల‌బ‌డే తీరు, అలాగే పుల‌వ‌ని కాపాడ‌టం కోసం తాను ఎంచుకునే దారి, రుధిర (బాబీ దేవోల్‌)తో ఫైట్​ త‌దిత‌ర సీన్స్​ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇక ఇందులోని ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి మరో హైలైట్​గా నిలిచాయి. ఇక ఇందులో ఓ స్టార్ హీరో అతిథి పాత్రలో తెర‌పై మెరుస్తాడు. ఆయన ఉన్న ఆ సీన్స్‌ రెండో పార్ట్​పై ఆస‌క్తిని పెంచుతాయి.

ఎవరెలా చేశారంటే :
సూర్య యాక్టింగ్​ ఈ సినిమాకి హైలైట్​గా నిలిచింది. ఫ్రాన్సిస్, కంగువా ఇలా రెండు పాత్ర‌ల్లోనూ ఆయన చక్కగా ఒదిగిపోయారు. కంగువాగా ఆయ‌న చూపించిన వీర‌త్వం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో, భావోద్వేగాల ప‌రంగానూ సూర్య బాగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక రుధిర పాత్ర‌లో బాబీదేవోల్ క‌నిపించిన తీరు మెప్పిస్తుంది కానీ, ఆ రోల్​కు మ‌రింత ప్రాధాన్యం ద‌క్కాల్సింది.

ఇక దిశా ప‌టానీ, యోగిబాబు త‌దిత‌రులు చిన్న పాత్ర‌ల్లోనే మెరిసి సంద‌డి చేస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. వెట్రి కెమెరా ప‌నిత‌నం వెయ్యేళ్ల కింద‌టి కాలంలోకి ఆడియెన్స్​ను తీసుకెళ్లింది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అక్క‌డ‌క్క‌డా మోతాదుకి మించి వినిపిస్తుంటుంది. పాట‌లు మాత్రం బాగా ఆక‌ట్టుకుంటాయి. డైరెక్టర్ శివ లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హా చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డంలో సక్సెస్​ అయ్యారు. కొన్ని స‌న్నివేశాల‌పై ప‌ట్టు చూపించారు. అయితే క‌థ‌ని పరిచ‌యం చేసి వ‌దిలేయ‌డం కాకుండా, ఆ పాత్ర‌ల లోతుల్ని ఆవిష్క‌రించి ఉంటే ఈ సినిమా ప‌రిపూర్ణం అయ్యేది. నిర్మాణం కూడా ఉన్న‌తంగానే ఉంది.

బలాలు:

క‌థా ప్ర‌పంచం

సూర్య న‌ట‌న

కంగువా, పుల‌వ పాత్ర‌ల మ‌ధ్య డ్రామా

బలహీనతలు:

ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగే క‌థ‌నం

చివరిగా: క‌ంగువా... సూర్య వ‌న్ మేన్ షో

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

'కంగువా' ట్విట్టర్ రివ్యూ- సూర్య పీరియాడికల్ డ్రామా ఎలా ఉందంటే?

1500 ఏళ్ల నాటి ప్రపంచం, రూ.300 కోట్ల బడ్జెట్​ - 'కంగువా' 10 ఆసక్తికర విశేషాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.