పాతబస్తీలో మొసలి కలకలం - భయాందోళనలో కాలనీవాసులు - Crocodile Found in Old City Drain - CROCODILE FOUND IN OLD CITY DRAIN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2024, 7:31 PM IST

Crocodile Spotted in Old City Drain : హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలోని జనావాసాల మధ్య ఓ మొసలి ప్రత్యక్షమవడం కలకలంగా మారింది. ఓల్డ్​సిటీలోని బహదూర్​పురాలో ఇళ్ల మధ్య గల నాలాలో మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ కాలనీవాసులు మొసలిని చూసి ఒక్కసారి షాక్ అయ్యారు. భయాందోళన చెందిన స్థానికులు వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన మొసలి ఉన్న ప్రదేశానికి చేరుకున్న జూ సిబ్బంది దానిని బంధించేందుకు కార్యాచరణ చేపట్టారు.

కాగా నాలాలో మొసలి ఉందన్న వార్త అప్పటికప్పుడే వైరల్​ కావడంతో, దాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. మరోవైపు నగరంలో కురుస్తున్న ఏకధాటి వర్షాలకు, ఎక్కడలేని పాములు, మొసళ్లు జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బహదూర్​పురాలోని నాలాలో వరద ఉద్ధృతి పెరగడంతో మొసలి కొట్టుకు వచ్చినట్లు అంతా భావిస్తున్నారు. ఏదేమైనా నగరంలోని నాలాలో మొసలి కనిపించడం ఒక్కసారి అలజడి రేగింది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.