ETV Bharat / snippets

కాంగ్రెస్​లోకి రండి! - ఆర్‌.కృష్ణయ్యతో ఎంపీ మల్లు రవి భేటీ

author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

R KRISHNAIAH WITH CONGRESS MP
MP Mallu ravi Meets BC Leader R Krishnaiah (ETV Bharat)

MP Mallu Ravi Meets BC Leader R Krishnaiah : రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కలిశారు. విద్యా నగర్​లోని కృష్ణయ్య నివాసానికి వెళ్లిన మల్లు రవి, కాంగ్రెస్​లోకి రావాలని ఆహ్వానించినట్లు బీసీ సంక్షేమ సంఘం నాయకులు చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం కమిటీ, తన అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని కృష్ణయ్య చెప్పినట్లు సమాచారం. ఇవాళ ఉదయం 11 గంటలకు కృష్ణయ్య మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో కృష్ణయ్య ఏ ప్రకటన చేస్తారోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.