ETV Bharat / sports

రికార్డులకు దగ్గరలో రోహిత్, విరాట్, అశ్విన్- కాన్పూర్ టెస్టు అందుకుంటారా? - Ind vs Ban 2nd Test

Ind vs Ban 2nd Test 2024 : కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్​తో టీమ్ఇండియా మరో 2 రోజుల్లో రెండో టెస్టు ఆడనుంది. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్, అశ్విన్ ముంగిట పలు రికార్డులు ఉన్నాయి. అవేంటంటే?

Ind vs Ban 2nd Test 2024
Ind vs Ban 2nd Test 2024 (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 25, 2024, 7:06 PM IST

Ind vs Ban 2nd Test 2024 : బంగ్లాదేశ్​పై తొలి టెస్టు విజయంతో జోష్ మీదున్న టీమ్ఇండియా, కాన్పూర్ వేదికగా జరగబోయే రెండో మ్యాచ్​లోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో ముమ్మురంగా టీమ్ఇండియా ఆటగాళ్లు నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ టెస్టులో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్​ను ఊరిస్తున్న రికార్డులేంటో ఓ సారి తెలుసుకుందాం.

రోహిత్ శర్మ
బంగ్లాదేశ్​తో కాన్పూర్ వేదికగా జరగబోయే టెస్టులో భారత జట్టు కెప్టెన్ రోహిత్ మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. రోహిత్ ఈ టెస్టులో 8 సిక్సర్లు బాదితే, టీమ్ఇండియా తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్​గా నిలుస్తాడు. ప్రస్తుతానికి వీరేంద్ర సెహ్వాగ్ (91) టీమ్ఇండియా తరఫున టెస్టు ఫార్మాట్​లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్​గా ఉన్నాడు.

అలాగే రోహిత్ ఈ టెస్టులో మరో 7 పరుగులు చేస్తే, టీమ్ఇండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ (4,154) ను దాటేస్తాడు. ప్రస్తుతం రోహిత్ టెస్టుల్లో 4,148 రన్స్ చేశాడు. టెస్టుల్లో ఇప్పటికే 12 సెంచరీలు చేసిన రోహిత్, ఇంకొక శతకం బాదేస్తే మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. టీమ్ఇండియా ప్లేయర్స్ రహానే, మురళీ విజయ్, పాలి ఉమ్రిగర్​ను శతకాల్లో దాటేస్తాడు.

అశ్విన్ రికార్డులు
టీమ్ఇండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్​ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరిగే రెండో టెస్టు నాలుగో ఇన్నింగ్స్​లో అశ్విన్ మరో వికెట్ తీస్తే అరుదైన ఫీట్​ను అందుకుంటాడు. టెస్టు నాలుగో ఇన్నింగ్స్​లో 100 వికెట్లు తొలి భారతీయుడిగా నిలుస్తాడు.

మరో 3 వికెట్ల దూరంలో : బంగ్లాదేశ్​పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా అవతరించడానికి అశ్విన్ మరో మూడు వికెట్లు తీయాలి. టీమ్ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ 31 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ 29 వికెట్లు పడగొట్టాడు.

ప్రపంచ వరల్డ్ ఛాంపియన్​షిప్ 2023- 2025 సీజన్​లో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌ వుడ్ 51 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. కాన్పూర్ లో జరిగే రెండో టెస్టులో అశ్విన్(48) మరో నాలుగు వికెట్లు తీస్తే తొలిస్థానాన్ని దక్కించుకుంటాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఘనత ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వార్న్(37) పేరిట ఉంది. కాన్పూర్ టెస్టులో అశ్విన్ మరోసారి 5 వికెట్లు తీస్తే షేన్ వార్న్ రికార్డును సమం చేస్తాడు. బంగ్లాదేశ్​తో జరగబోయే రెండో టెస్టులో అశ్విన్ మ‌రో 8 వికెట్లు సాధిస్తే, ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్​షిప్​లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్​గా నిలుస్తాడు.

ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ నాథ‌న్ లైయ‌న్ 187 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అశ్విన్ 180 వికెట్లతో రెండో ప్లేస్​లో ఉన్నాడు. బంగ్లాతో జరగబోయే రెండో టెస్టులో అశ్విన్ మరో 9వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ నాథన్ లియాన్ (530)ను అధిగమిస్తాడు. ప్రస్తుతం అశ్విన్ భారత్ తరఫున 522 వికెట్లు పడగొట్టాడు.

విరాట్​ అతి చేరువలో
బంగ్లాతో జరిగే రెండో టెస్టులో టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను సాధించే అవకాశం ఉంది. మరో 35 పరుగులు చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి 27,000 రన్స్ చేసిన నాలుగో బ్యాటర్​గా విరాట్ నిలవనున్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్​లో సచిన్, కుమార్ సంగక్కర, పాంటింగ్ మాత్రమే అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 27వేల పరుగులు చేశారు. అలాగే 600 కంటే తక్కువ ఇన్నింగ్స్‌ లలో 27,000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్​గా చరిత్రలో నిలిచిపోతాడు కోహ్లీ. కాగా, విరాట్ 593 ఇన్సింగ్స్​ల్లోనే 26,965 పరుగులు చేశాడు.

సచిన్ రికార్డుపై కన్ను : మరో మూడు క్యాచ్​లు పడితే సచిన్(115) రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. టెస్టు ఫార్మాట్​లో భారత్ తరఫున ఎక్కువ క్యాచ్​లు అందుకున్న వారిలో తొలిస్థానంలో రాహుల్ ద్రవిడ్(210), వీవీఎస్ లక్ష్మణ్ (135) రెండో స్థానంలో ఉన్నారు. అలాగే కాన్పూర్ టెస్టులో విరాట్ మరో సెంచరీ బాదితే డాన్ బ్రాడ్​మెన్(29) శతకాలను దాటేస్తాడు. అలాగే మరో 7 ఫోర్లు కొడితే టెస్టుల్లో కోహ్లీ బౌండరీల సంఖ్య 1,000కు చేరుతుంది.

కాన్పూర్ వేదికగా

కాగా, కాన్పూర్ వేదికగా టీమ్ఇండియా 23 టెస్టులు ఆడింది. అందులో 7 మ్యాచ్​ల్లో నెగ్గగా, 3 టెస్టుల్లో ఓటమిపాలైంది. మరో 13 మ్యాచ్​లు డ్రాగా ముగిశాయి. అలాగే బంగ్లాదేశ్​తో టీమ్ఇండియా కాన్పూర్ వేదికగా సెప్టెంబరు 27నుంచి రెండో టెస్టులో తలపడనుంది.

రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్​ - ఇక్కడ వికెట్​ ఎలా ఉంటుంది? ఎవరికి అనుకూలం? - India vs Bangladesh 2nd Test

సర్ఫరాజ్​కు మళ్లీ నిరాశే! - రెండో టెస్ట్​ నుంచి రిలీజ్​ - ఎందుకంటే? - IND VS BAN Sarfaraz Khan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.