వెజ్ ఆర్డర్లపై స్విగ్గీ నివేదిక - హైదరాబాద్ ర్యాంక్ ఎంతంటే?
Published : Aug 1, 2024, 9:12 AM IST
Swiggy Report on Hyderabad Food Orders :హైదరాబాద్ అనగానే అందరికి ఠక్కున గుర్తొచ్చేది దమ్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. భాగ్యనగరవాసుల ఫుడ్ ఆర్డర్లలో మెజార్టీ వాటా బిర్యానీదే. అయితే మాంసాహారంలోనే కాదు శాకాహారంలోనూ హైదరాబాదీలు ముందు వరుసలో నిలిచారని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పేర్కొంది. శాకాహార వంటల ఆర్డర్లలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందని బుధవారం రోజున స్విగ్గీ ప్రకటించింది. ఇడ్లీ, మసాల దోశలను హైదరాబాదీలు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని తెలిపింది. దేశంలో అత్యధికంగా ఆర్డర్ అవుతున్న పది వంటకాల్లో ఆరు శాకాహారం వంటకాలే ఉన్నాయని పేర్కొంది. తొలి రెండు స్థానాల్లో బెంగళూరు, ముంబయి నగరాలు నిలిచినట్లు చెప్పింది.