national

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు - రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లకు స్థానచలనం

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 7:18 PM IST

GHMC Commissioner Full Responsibilities
Amrapali Appoint As GHMC Commissioner (ETV Bharat)

Amrapali Appoint As GHMC Commissioner : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్​గా ఆమ్రపాలిని పూర్తిస్థాయిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్​గా ఉన్న ఆమ్రపాలి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్​గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూసీ నది అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా కూడా ఆమె ఇప్పటి వరకు అదనపు బాధ్యతల్లో ఉన్నారు.

మూసీ అభివృద్ధి సంస్థ ఎండీగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్​కు అదనపు బాధ్యతలు కేటాయించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్​గా కోట శ్రీవాస్తవను ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా ఐఏఎస్ అధికారి మయాంక్ మిత్తల్ నియమితులయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్​గా చాహత్ బాజ్ పాయ్​ను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details