ETV Bharat / snippets

'హైడ్రా' ఎప్పుడైనా జల విహార్​ను తనిఖీ చేసుకోవచ్చు : జల విహార్ ఎండీ

author img

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

JALAVIHAR MD ABOUT HYDRA CASE
Jala vihar MD on Hydra (ETV Bharat)

Jala vihar MD on Hydra : హైదరాబాద్ నెక్లెస్​ రోడ్​లోని జల విహార్​పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఎండీ విజయ్ ఆదిత్య రాజు తెలిపారు. తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీసే విధంగా కొంతమంది అవాస్తవాలతో హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. హైడ్రా ఎప్పుడైనా జల విహార్​ను తనిఖీ చేసుకోవచ్చని విజయ్ స్పష్టం చేశారు. అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా 12.5 ఎకరాల స్థలాన్ని కేటాయించిందన్నారు.

అందులోనే వాటర్ పార్క్ ఏర్పాటు చేశామని, ఎక్కడా హద్దులు దాటలేదని ఎండీ విజయ్ ఆదిత్య రాజు వెల్లడించారు. హైడ్రా చేస్తున్న మంచి పనులకు తమ మద్దతు ఉంటుందని, జల విహార్ పరంగా తమ సహకారం హైడ్రాకు అందిస్తామని పేర్కొన్నారు. జల విహార్​కు సంబంధించి ప్రభుత్వానికి తాము ఎలాంటి బకాయిలు లేమని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.