ETV Bharat / entertainment

అఖిల్‌ అప్పటి వరకు ఫ్యాన్స్​ ముందుకు రానన్నాడు : నాగార్జున - Nagarjuna Comments on Akhil - NAGARJUNA COMMENTS ON AKHIL

Nagarjuna About Akhil Hit Movies : నాగార్జున వారసుడిగా అక్కినేని అఖిల్​ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ ఆయనకు సరైన హిట్ పడలేదు. అయితే తాాజాగా ఈ విషయమై నాగ్ స్పందించారు.

source ETV Bharat
Akkineni Akhil Nagarjuna (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 6:33 AM IST

Updated : Sep 21, 2024, 7:28 AM IST

Nagarjuna About Akhil Hit Movie : తెలుగు చిత్ర పరిశ్రమలో ఏఎన్నార్ తర్వాత ఆయన వారసుడిగా నాగార్జున సక్సెస్ ఫుల్ హీరో అయ్యారు. తెలుగు ప్రేక్షకుల మదిలో స్టార్ హీరోగా, కింగ్​, మన్మథుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్​ సొంతం చేసుకున్నారు. బాలీవుడ్​లోనూ పలు చిత్రాలు చేశారు. ఇక నాగార్జున వారసులుగా నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ స్టార్స్ రేంజ్​కు ఇంకా వెళ్లలేదు. చైతన్య ఓకే కానీ అఖిల్ మాత్రం ఇంకా సక్సెస్​ ఖాతా ఓపెన్ చేయలేదు.

అయితే తాజాగా ఈ విషయమై నాగార్జున స్పందించారు. హిట్‌ కొట్టే వరకు అభిమానుల ముందుకు రానని తనతో అఖిల్‌ చెప్పినట్టు నాగార్జున తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి(ANR 100th birthday celebrations) సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వేడుకలో నాగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ఈవెంట్‌కు అఖిల్‌ హాజరవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ అఖిల్​ గురించి అడగగా నాగార్జున స్పందించారు. అభిమానులను అడిగినట్టు చెప్పమన్నాడని నాగార్జున పేర్కొన్నారు.

Akkineni Akhil Upcoming Movies : అక్కినేని అఖిల్ హీరోగా అఖిల్ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్​ ముందు అంతగా ఆడలేదు. అనంతరం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పర్వాలేదనిపించింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటించింది. కానీ ఇది కూడా భారీ హిట్ అవ్వలేదు.

అయితే ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా మాత్రం డిజాస్టర్​గా నిలిచింది. దీంతో అఖిల్ కెరీర్​ సందిగ్ధంలో పడింది. కానీ అఖిల్​ కోసం నిర్మాతలు భారీ బడ్జెట్​ పెట్టేందుకు సిద్ధమయ్యారు. యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్​లో(Akhil Akkineni UV Creations) కొత్త దర్శకుడితో ఓ సోషియో ఫాంటసీ సినిమా చేయనున్నారు. దీన్ని ఇంకా అఫీషియల్​గా అనౌన్స్ చేయలేదు.

'కూలి' నాగార్జున వైల్డ్​ లుక్​ షూటింగ్​ వీడియో లీక్​ - రోలెక్స్​ తరహాలో క్రూరంగా చంపేస్తూ! - Coolie Nagarjuna Video Leaked

ఏఎన్నార్​ నెగిటివ్ పాత్రల్లో నటించకపోవడానికి కారణం ఏంటంటే? - ANR Birth Anniversary

Last Updated : Sep 21, 2024, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.