Tamim Iqbal On Jasprit Bumrah : టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలోనే బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 400 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. అయితే బుమ్రాపై బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ తమిమ్ ఇక్బాల్ ప్రశంసలు కురిపించాడు. స్కిల్స్‌కు టాలెంట్ తోడైతే బుమ్రా లాంటి భయంకర బౌలర్‌ను చూస్తామని అన్నాడు.
'జస్ప్రీత్ బుమ్రా నైపుణ్యాలు అద్భుతం. బుమ్రాకు నమ్మశక్యం కాని స్కిల్స్‌తోపాటు ఆలోచన విధానం కూడా బాగా ఉంది. ఎన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ షార్ప్ బ్రెయిన్ లేకపోతే బ్రుమా వలె కెరీర్లో సక్సెస్ఫుల్ అవ్వలేరు. ఈ రెండిటి కలయిక అతి భయంకరమైనది. దీన్ని ప్రస్తుతం ప్రపంచం చూస్తోంది. కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచ క్రికెట్లో బుమ్రా ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది. అతడికి మంచి ప్లాట్‌ఫామ్ ఇచ్చిన ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీకి కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది' అని ఇక్బాల్ అన్నాడు.
Tamim Iqbal said, " jasprit bumrah has incredible skills, but he has incredible brains as well. you may have a lot of skills, but if you don't have brains, you won't be as succcesful as bumrah. this is what the world is watching". pic.twitter.com/EIyVbL0dOH
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2024
Bumrah 400 wickets : బుమ్రా భారత్ తరఫున 400 వికెట్లు పూర్తి చేసిన 6వ పేసర్‌గా నిలిచాడు.ఈ లిస్ట్‌లో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ 687 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా భారత్ నుంచి 400+ వికెట్లు తీసిన 10వ బౌలర్‌గానూ బుమ్రా నిలిచాడు.
Boom Boom Bumrah 🎇
— BCCI (@BCCI) September 20, 2024
Cleans up Shadman Islam with a peach of a delivery.
Live - https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank | @Jaspritbumrah93 pic.twitter.com/RYi9AX30eA
మ్యాచ్ విషయానికొస్తే, రెండో రోజు ఆట ముగిసే సరికి టీమ్ఇండియా 308 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ ఇన్నింగ్స్‌లో 81-3 స్కోర్‌తో ఉంది. తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి 227 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (5 పరుగులు), విరాట్ కోహ్లీ (17 పరుగులు) మరోసారి నిరాశ పర్చారు.
ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) కూడా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. క్రీజులో శుభ్‌మన్ గిల్ (33), రిషభ్ పంత్ (12) ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 379 పరుగులు చేయగా, బంగ్లా 149 వద్ద కుప్పకూలింది.
బుమ్రా @ 400 వికెట్లు - అరుదైన ఫీట్ అందుకున్న స్టార్ బౌలర్ - Ind vs Ban Test Series 2024
బుమ్రా, సిరాజ్ అదుర్స్ - 149 పరుగులకే బంగ్లా ఆలౌట్ - IND vs BAN Test 2024