ETV Bharat / snippets

గాడిద పాలు లీటరుకు 2,350 రూపాయలంటే నమ్మారు! లక్షలు పొగొట్టుకున్నారు

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

JENNY MILK COMPANY
DONKEY MILK SCAM IN KARNATAKA (ETV Bharat)

DONKEY MILK SCAM IN KARNATAKA: కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హొసపేటెలో గాడిద పాల సేకరణ పేరుతో ఏర్పాటు చేసిన జెన్నీ మిల్క్‌ కంపెనీ బ్రాంచి మూసివేశారని తెలియటంతో మోసపోయిన సుమారు 300 మంది శుక్రవారం పట్టణ ఠాణాకు తరలివచ్చారు. రూ. 3లక్షలు చెల్లిస్తే మూడు గాడిదలు ఇస్తామని, వాటిని పోషిస్తూ పాలు పితికి ఇస్తే లీటరుకు రూ. 2,350 చెల్లిస్తామని ప్రచారం చేయడంతో చాలామంది డబ్బులు కట్టి మోసపోయారు. వీరిలో కొందరికి గాడిదలు అంటగట్టగా, మరికొందరి వద్ద సొమ్ములు తీసుకొని మొండిచేయి చూపారు. ‘మా అమ్మ శస్త్రచికిత్సకని కొంత డబ్బు దాచాను. ఇంతలో జెన్ని మిల్క్‌ గురించి ప్రచారం జరగటంతో రూ. 10.5 లక్షలు చెల్లించాను’ అని వడ్రహళ్లి వసంత్‌ కన్నీరు మున్నీరయ్యారు. పైసా కూడా తిరిగి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.