ETV Bharat / entertainment

కారు ప్రమాదంలో నటుడికి గాయాలు - ఐసీయూలో చికిత్స - Preeti Jhangiani Husband - PREETI JHANGIANI HUSBAND

Actress Preeti Jhangiani Husband Hospitalised : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింగ్యానీ భర్త, నటుడు పర్విన్ దాబాస్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఓ కారు ప్రమాదంలో గాయాలపాలైన ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Preeti Jhangiani Husband Parvin Dabas
Preeti Jhangiani Husband Parvin Dabas (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 12:56 PM IST

Updated : Sep 21, 2024, 1:03 PM IST

Actress Preeti Jhangiani Husband Hospitalised : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింగ్యానీ భర్త, బీటౌన్​ నటుడు పర్విన్ దాబాస్‌కు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన బాంద్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలోనే చికిత్స అందుకుంటున్నట్లు ఆయన టీమ్‌ తెలిపింది.

పర్విన్​ సతీమణి నటి ప్రీతి జింగ్యానీ తెలుగు వారికి సుపరిచితురాలే. ఈమె 'తమ్ముడు' సినిమాలో పవన్​ కల్యాణ్ సరసన నటించి ఇక్కడి వారికి చేరువయ్యారు. ఇందులో ఆమె జానకి అనే క్యారెక్టర్​లో నేచురల్​గా నటించి మెప్పించారు. ఈ సినిమా ద్వారానే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత తెలుగులోనూ పలువురు అగ్రతారల సరసన నటించారు. బాలకృష్ణతో 'నరసింహ నాయుడు', నాగార్జునతో 'అధిపతి' రాజేంద్ర ప్రసాద్​తో 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్' లాంటి సినిమాల్లో మెరిశారు. ఇక 'యమదొంగ' సినిమాలోని ఓ సాంగ్​లో గెస్ట్​ రోల్​లో కనిపించారు. అయితే తెలుగులో చివరగా ఈమె 'విశాఖా ఎక్స్​ప్రెస్' సినిమాలో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్​లో బిజీ అయిపోయారు. తెలుగు, హిందీలోనే కాకుండా ఈమె కన్నడ, ఉర్దూ, పంజాబీ భాషల్లోనూ నటించారు. ఇటీవలే 'కఫాస్' అనే వెబ్​ సిరీస్​లో కనిపించారు. ఇది కూడా ఓటీటీలో మంచి టాక్ అందుకుంది.

ఇక పర్విన్ కూడా బాలీవుడ్​లో పాపులర్​ నటుడే. ఈయన హిందీలోనే కాకుండా ఇంగ్లీష్​, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించారు. 'మై నేమ్​ ఈజ్ ఖాన్', 'జల్ పరి', 'ఘన్ చక్కర్', 'ముస్కాన్', 'కోస్​లా కా ఘోస్​లా' లాంటి సినిమాల్లో పర్విన్ యాక్టింగ్​కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ జంటకు వీరికి జైవీర్, దేవ్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ప్రస్తుతం వీరు అటు ప్రొపషనల్ లైఫ్​తో పాటు పర్సనల్​ లైఫ్​ను బ్యాలెన్స్ చేస్తూ గడుపుతున్నారు. ప్రీతి కూడా సోషస్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ అభిమానుల కోసం మూవీ అప్​డేట్స్ షేర్ చేస్తుంటారు.

'ముద్దు సీన్లలో నేను.. వాళ్లకు నచ్చేది కాదు!'

Last Updated : Sep 21, 2024, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.