ఎమ్మెల్యే గాంధీ నివాసం వద్ద మళ్లీ భారీగా మోహరించిన పోలీసులు - అదే కారణం!
Published : Sep 15, 2024, 12:31 PM IST
Police Deployed Around MLA Arekapudi Gandhi House : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం వద్ద మళ్లీ పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ నాయకులు గాంధీ నివాసానికి వస్తారనే ఊహాగానాలు ఎక్కువ అవ్వడంతో స్థానిక పోలీసులు, అదనపు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసులు పెద్ద ఎత్తున ఉండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పోలీసులు కాలనీ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 200 మంది పోలీసులతో గాంధీ ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు.