Mazda Art Festival : హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ పేరుతో మూడు రోజుల పాటు జరిగిన వేడుక చూపరులను కనువిందు చేసింది. అందమైన చిత్రాలు, పెన్సిల్ ఆర్ట్‌లు, ఆక్రిలిక్ పెయింట్స్, రియలిస్ట్, మోడర్న్ వంటి వివిధ రకాల కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భావ వ్యక్తీకరణను హృదయానికి హత్తుకునేలా వివరించే శక్తి ఒక్క కళకే ఉంటుంది. అలాంటి దాదాపు 200లకు పైగా అద్భుతమైన పెయింటింగ్స్ నగరవాసులను మూడు రోజుల పాటు అలరించాయి.
భావాన్ని హృదయానికి చేరేవేసే శక్తి ఒక్క కళకే ఉంది- మజ్దా ఆర్ట్ ఫెస్టివల్2024
MAZDA ART FESTIVAL IN HYDERABAD (ETV Bharat)
Published : Sep 23, 2024, 3:26 PM IST
ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో దేశం నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది కళాకారులు పాల్గొన్నారు. మొత్తం 7 గ్యాలరీల్లో ఏర్పాటు చేసిన పెయిటింగ్స్ చూపరులను విశేషంగా కట్టిపడేశాయి. మూడు రోజలపాటు జరిగిన ఈ ఎగ్జిబీషన్ లో పలువురు ప్రముఖ కళాకారుల చిత్రాలు కుంచెల నుంచి జాలు వారిన పెయింటింగ్స్ ఆద్యంతం అలరించాయి. ఒక్కో కళాకారుడు ఒక్కో రకంగా తన కళలకు రూపం ఇచ్చారు.