national

ETV Bharat / snippets

లోన్​ యాప్​ల ద్వారా రూ.9 లక్షల అప్పు - వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య

Man Dies Of Loan App Harassment In Hanamkonda
Man Dies Of Loan App Harassment In Hanamkonda (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2024, 1:25 PM IST

Man Dies Of Loan App Harassment In Hanamkonda :ఆన్‌లైన్‌ యాప్‌ల వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో అనిల్‌ అనే యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. బతుకుదెరువు కోసం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను నడుపుతున్నాడు.

వివిధ లోన్‌యాప్​ల ద్వారా సుమారు రూ.9 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. లోన్‌యాప్‌ల నుంచి తీసుకున్న అప్పులు కట్టాలని తరచూ ఫోన్లు వస్తుండటంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details