ETV Bharat / offbeat

క్రిస్పీ అండ్​ టేస్టీ "మద్రాస్​ స్టైల్ చికెన్ 65" - ఇలా చేస్తే ఒక్క ముక్క కూడా మిగల్చరు! - CHICKEN 65 RECIPE IN TELUGU

- పార్టీ, ఈవెంట్స్​కు పర్ఫెక్ట్ స్టార్టప్

Chicken 65 Recipe
How to Make Chicken 65 Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 4:00 PM IST

How to Make Chicken 65 Recipe : సండే వచ్చిందంటే చాలు.. నాన్​వెజ్​ ప్రియులకు పండగే. ఇక చాలా మందికి ఆదివారం ముక్క లేనిదే అసలు ముద్ద దిగదు. కచ్చితంగా చికెన్​ లేదా మటన్​తో ఏదైనా వంటకం చేసుకుని తింటారు. అయితే, చికెన్​తో ఎప్పుడూ ఒకేలా బిర్యానీ, ఫ్రై, కర్రీ కాకుండా కాస్త కొత్తగా స్ట్రీట్​ స్టైల్లో చికెన్ 65 ట్రై చేద్దాం. ఈ స్టోరీలో చెప్పినట్లు చేస్తే చికెన్​ 65 క్రిస్పీగా, టేస్ట్​ ఎంతో బాగుంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా స్ట్రీట్​ స్టైల్లో చికెన్ 65 ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్‌ ముక్కలు - అరకిలో
  • అల్లం వెల్లుల్లి పేస్టు- 2 టీస్పూన్లు
  • కారం -2 టీస్పూన్లు
  • గరం మసాలా-టీస్పూన్​
  • ధనియాల పొడి- టీస్పూన్​
  • జీలకర్రపొడి- టీస్పూన్​
  • పసుపు - పావు టీస్పూన్​
  • నిమ్మరసం కొద్దిగా
  • కార్న్‌ఫ్లోర్‌ (మొక్కజొన్న పిండి)- 2 టేబుల్‌ స్పూన్లు
  • గుడ్డు- ఒకటి
  • పెరుగు-పావుకప్పు
  • పచ్చిమిర్చి- నాలుగు
  • కరివేపాకు- ఐదారు రెబ్బలు
  • ఉప్పు- తగినంత
  • ఫుడ్​ కలర్​-చిటికెడు(రెడ్​ కలర్​)
  • నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా చికెన్‌ ముక్కలను నీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోవాలి.
  • ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్​, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, జీలకర్రపొడి, పసుపు, నిమ్మరసం, కరివేపాకులు కొన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.
  • మసాలాలు చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి.
  • ఆపై కార్న్​ఫ్లోర్​ వేసి మిక్స్​ చేయాలి. (కార్న్​ఫ్లోర్​కి బదులుగా మైదా లేదా బియ్యం పిండి ఉపయోగించవచ్చు).
  • ఇప్పుడు పెరుగు, ఫుడ్​ కలర్​ వేసి కలపండి. చికెన్​ కోటింగ్​ కాస్త గట్టిగా ఉండాలి. అవసరమైతే కొద్దిగా కార్న్​ఫ్లోర్​ వేసుకోవచ్చు.
  • మ్యారినేట్​ చేసుకున్న చికెన్ గంటపాటు ఫ్రిడ్జ్​లో ఉంచండి.
  • తర్వాత బాగా బీట్​ చేసిన సగం ఎగ్​ వేసుకుని కలుపుకోండి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి నూనె పోయండి. నూనె వేడయ్యాక స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి చికెన్ ముక్కలను ఒక్కోటిగా వేస్తూ ఫ్రై చేసుకోండి.
  • చికెన్​ ముక్కలు సగానికి పైగా వేపుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి కాస్త చల్లారనివ్వాలి. తర్వాత మళ్లీ నూనెలో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా రెండుసార్లు చికెన్ 65 ఫ్రై చేసుకుంటే టేస్ట్​ చాలా బాగుంటాయి.
  • తర్వాత నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకులు ఫ్రై చేసుకుని చికెన్​ 65 ప్లేట్లో వేసుకోండి. అంతే ఇలా చేసుకుంటే క్రిస్పీ చికెన్ 65 రెడీ.
  • నచ్చితే ఇలా ఓ సారి చికెన్ 65 ట్రై చేయండి.

పార్టీ స్పెషల్ : ఫుల్ టేస్టీ వెల్లుల్లి కోడి వేపుడు - తిని తీరాల్సిందే!

"బెంగాలీ స్టైల్​ చికెన్ కర్రీ" - ఇలా వండితే ఇంట్లో అందరూ ఆహా అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.