ETV Bharat / state

నిర్మల్ జిల్లాలో కూలిన వంతెన - ప్రమాదకర రీతిలో సాహసం చేస్తూ గమ్యం చేరుతున్న ప్రజలు - COLLAPSED BRIDGE AT NIRMAL DISTRICT

నిర్మల్​ జిల్లా కుంటాల మండలంలో కూలిన వెంతెన - తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకర రీతిలో గమ్యం చేరాల్సిన పరిస్థితి - నేటికీ పూర్తి కాని వంతెన పనులు

Collapsed bridge AT Nirmal District
Collapsed bridge AT Nirmal District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2024, 3:46 PM IST

Collapsed bridge at Nirmal District : నిర్మల్‌ జిల్లాలోని కుంటాల మండలం కల్లూరు, నర్సాపూర్‌(జి) మండలంలోని పాత భూర్గుపెల్లి(కె) గ్రామాలను అనుసంధానం చేస్తూ 20 ఏళ్ల కిందట కల్లూరు-పేండ్‌పెల్లి వాగు కలిసే చోట ఎస్సారెస్పీ ఆధ్వర్యంలో వంతెన నిర్మించారు. ఈ బ్రిడ్జి ద్వారా పలు గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉండేది. నిర్మాణ లోపాలు, భారీ వర్షాలు, వరదలతో మార్చి 5తేదీన ఓ భారీ వాహనం వెళ్లిన సందర్భంలో ఓ పిల్లర్‌ విరిగిపోయింది. దీంతో ఆ వంతెనకు సంబంధించిన రెండు శ్లాబులు కూలిపోయాయి. వాహనదారుల, పాదచారుల దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

పైపు ద్వారా పాకుతూ గమ్యం చేరుకుంటున్ ప్రజలు : వంతెన వద్ద 25-30 అడుగుల మేర ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ నిల్వ ఉండటం వల్ల పాత భూరుగపల్లి(కె) వాసులు రెండు కిలోమీటర్ల దూరంలోని పొలాలకు చేరేందుకు సుమారు 15 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీలను, పంట ఉత్పత్తులను తరలించడం సంగతి సరేసరి. వంతెనపై మిషన్‌ భగీరథ పైపు ఉంది.

Collapsed bridge at Nirmal District
ప్రమాదకర రీతిలో గమ్యం చేరుతున్న ప్రజలు (ETV Bharat)

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతులా కొంత మంది ఆ పైపుపై పాకుతూ గమ్యాన్ని చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈత వచ్చిన జాలర్లు, రైతులు మాత్రమే ఆ సాహసం చేస్తున్నారని, ఓ రైతు రూ.6000 వెచ్చించి తెప్ప తయారు చేసి ఎరువులు వంటివి తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు. వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లుగా స్థానిక ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొన్నారు. వంతెన కూలడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంలో సంబంధాలు తెగిపోయాయి.

కూలిన వంతెన.. మూడు మండలాలకు నిలిచిపోయిన రాకపోకలు

Live Video : వానొచ్చిందంటే ఉప్పొంగే వాగు.. 'తాడు'తోనే వారి ప్రయాణం సాగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.