national

ETV Bharat / snippets

డీజే శబ్ధాలకు గుండెపోటు - డ్యాన్స్​ చేస్తుండగా యువకుడి మృతి

By ETV Bharat Telangana Team

Published : 18 hours ago

Updated : 17 hours ago

Man Dies Of Heart Attack While Dancing
Man Dies Of Heart Attack While Dancing (ETV Bharat)

Man Dies Of Heart Attack While Dancing : డీజే శబ్దాలకు గుండెపోటుతో యువకుడు మరణించిన ఘటన ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమలాపురం మండలం బండారులంకకు చెందిన పప్పుల వినయ్‌ (22) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చాడు. శనివారం రాత్రి కొంకాపల్లిలో నిర్వహించిన దసరా ముగింపు ఉత్సవంలో పాల్గొన్న అతడు డీజే పాటల మధ్య స్నేహితులతో కలిసి నృత్యం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు.

Last Updated : 17 hours ago

ABOUT THE AUTHOR

...view details