ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు అనుకోని సమస్యలు- ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభకరం!

అక్టోబర్ 15వ తేదీ (మంగళవారం) రాశిఫలాలు

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today 15th October 2024 : 2024 అక్టోబర్ 15వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. వ్యాపారం బాగా రాణిస్తుంది. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్నవారికి శుభఘడియలు ఆసన్నమయ్యాయి. త్వరలోనే కళ్యాణ కాంతులను చూస్తారు. శ్రీ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారపరంగా అద్బుతమైన రోజు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలుంటాయి. మీ పని తీరుకి లభించే ప్రశంసలతో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఇది మీకు పేరు, ప్రఖ్యాతలతో పాటు సమాజంలో గుర్తింపును తీసుకువస్తుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా నేడు మెండుగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీదేవి అష్టోత్తరం పఠిస్తే శుభం జరుగుతుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంగా ఉండడం అవసరం. మీ తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సంబంధాలు చెడగొట్టుకోవడం అంత మంచి ఆలోచన కాదు. రాజీపడేందుకు ప్రయత్నించండి. తద్వారా పని ప్రదేశంలో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలుగుతారు. విలాసవంతమైన వాటిపై అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వృత్తి వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మీకు, మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే అక్రమ, అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కోపావేశాలతో పౌరుషంగా మాట్లాడి ఇతరులకు బాధ కలిగించవద్దు. వ్యాపారంలో ఆర్ధిక నష్ట భయం ఉంది. అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. శని స్తోత్ర పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపార ప్రయోజనాలు కోసం నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలా ఈ రోజు శుభయోగాలున్నాయి. ఈ అద్భుతమైన రోజు నుంచి అత్యధిక ప్రయోజనాన్ని పొందండి. వ్యాపార భాగస్వాముల నుంచి ఆర్ధిక ప్రయోజనాలను పొందవచ్చు. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ఉల్లాసభరితంగా ఉంటారు. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. గురు దర్శనం శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సాహిత్య చర్చల్లో, వాదనల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా మీ విశ్లేషణ, సృజనాత్మక సామర్ధ్యాలను పరీక్షించడానికి ఇది మంచి రోజు. మీరు సృజనాత్మక రచనలు వ్రాయడం గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు అలాంటి కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. ఇతర రంగాల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులుండవచ్చు. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలుంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మొండితనం, పట్టుదల కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా భారీ నష్టాలు చూస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే తరువాత చింతించాల్సి వస్తుంది. కుటుంబ కలహాలు మానసిక అశాంతిని కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. గురువుల దర్శనంతో ఆటంకాలు తొలగిపోతాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ సమస్యల పరిష్కారానికి పూనుకుంటారు. సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఆర్ధిక అంశాలపై స్పష్టమైన అవగాహనతో ఉంటారు. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు తీవ్రం కావడం వేదన కలిగిస్తుంది. ఉద్యోగంలో సానుకూలత ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో గొడవలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు మౌనంగా ఉండటం శ్రేయస్కరం. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో తీర్ధయాత్రలకు వెళ్తారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ముఖ్యమైన వ్యవహారాలలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మైలురాయిని అందుకుంటారు. వృత్తిపరమైన స్థాయి పెరగడం వల్ల సమాజంలో హోదా పెరుగుతుంది. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడంతో ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీరామ నామ జపం రక్షిస్తుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయాలు పొందడానికి మీ పూర్తి శక్తియుక్తులను వినియోగించాల్సి ఉంటుంది. ఆర్ధికంగా ఆశించిన దానికన్నా అధిక ప్రయోజనాలుంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ధ్యానం, యోగా సాధన చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో వాగ్వివాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.