ETV Bharat / spiritual

"మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయా ? - ఈ పరిహారాలు చేస్తే మొత్తం తీరిపోతాయి!" - DEBT RELIEF ASTROLOGY

-జ్యోతిష్యం ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే రుణ విముక్తి! - అవి ఎలా చేయాలో మీకు తెలుసా?

Debt Astrology
Tips to Get Rid of Debt Astrology (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2024, 3:58 PM IST

Tips to Get Rid of Debt Astrology : అప్పు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. కానీ.. మనలో చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు అప్పులు చేస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత అవి తీర్చలేనంత భారంగా మారిపోతాయి. అయితే, తీవ్రమైన అప్పుల నుంచి విముక్తి పొందడానికి కొన్ని పరిహారాలను పాటించాలని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్​ కుమార్'​ చెబుతున్నారు. ఆ పరిహారాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

ఎర్ర కందిపప్పు దానం చేయండి : మంగళవారం రోజున తలస్నానం చేసిన తర్వాత.. ఎర్రటి వస్త్రంలో ఒక కిలో ఎర్ర కందిపప్పు మూట కట్టండి. దీనిని శివాలయానికి వెళ్లి అక్కడి పంతులుకు దానం ఇవ్వండి. అలాగే గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి. ఆ తర్వాత నీళ్లున్న గాజు పాత్రలో పాలరాయి వేసి ఉంచండి. ఈ పరిహారం చేయడం వల్ల క్రమక్రమంగా అప్పులు తీరిపోతాయట.

అశోక చెట్టు పెంచండి : హిందూ సంప్రదాయాలలో అశోక చెట్టుని పార్వతీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టు ఈశ్వరుడికి ఎంతో ప్రియమైంది. మీరు అప్పుల బాధతో బాధపడుతుంటే.. అశోక చెట్టును తీసుకొచ్చి ఇంటి ఆవరణలో చిన్న కుండీలో ఉంచండి. ఆ చెట్టు దగ్గర శివపార్వతుల ఫొటో ఉంచి రోజూ పూజించండి. అలాగే దీపం వెలిగించండి. ఇలా చేస్తే ఏదోక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు త్వరగా తీరిపోతాయి. భవిష్య పురాణంలో కూడా ఈ అశోక చెట్టు గురించి చెప్పారు.

మంగళవారం నాడు : ప్రతి మంగళవారం సాయంత్రం పూట బకెట్లో కొన్ని నీళ్లు పోయండి. ఆ నీళ్లలో కొన్ని పాలు, పెరుగు, నెయ్యి చుక్కలు వేయండి. తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు, ఆవు పంచకం కలపండి. ఈ నీటిని ఇంట్లోని అన్ని గదుల్లో చల్లండి. ఆ తర్వాత సింహ ద్వారం బయట ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఈ పరిహారం ద్వారా క్రమక్రమంగా అప్పుల బాధ తీరిపోతుందట.

గులాబీ రంగు వస్త్రంలో : ఒక గులాబీ రంగు వస్త్రంలో 11 రూపాయి నాణేలు, చిటికెడు పసుపు, కుంకుమ, తెల్ల జిల్లేడు పూలు వేసి మూట కట్టండి. తర్వాత మీ ఇష్ట దైవం పాదాల చెంత ఉంచండి. రోజూ ఆ మూటను పూలతో పూజించండి. అప్పులు తీరిపోయాక రూపాయి నాణాలు, గులాబీ రంగు వస్త్రం బీరువాలో ఉంచండి. తెల్ల జిల్లేడు పూలను మాత్రం ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసి రండి. ఈ పరిహారం కూడా అప్పులు తీరడానికి విశేషంగా సహకరిస్తుంది.

పిల్లలకు ఈ ప్రసాదం పెట్టండి : మంగళవారం రోజున మీ ఇష్ట దైవం దగ్గర దీపారాధన చేయండి. అలాగే తెల్ల నువ్వులతో చేసిన జీడి ఉండలను నైవేద్యంగా పెట్టండి. తర్వాత వాటిని ప్రసాదంగా నలుగురు చిన్నపిల్లలకు ఇవ్వండి. ఇలా మంగళవారం నుంచి మళ్లీ వచ్చే మంగళవారం వరకు చేయాలి. ఇలా చేస్తే అప్పుల బాధ తగ్గిపోతుంది.

  • అప్పులు ఎక్కువగా ఉన్నవారు మంగళవారం రోజున నానబెట్టిన కందులు, బెల్లం ఆవులకు పెట్టండి.
  • ప్రతి మంగళవారం రోజున స్నానం చేసేటప్పుడు బకెట్లో.. కొన్ని నల్ల నువ్వులు, ఉసిరిక పొడి కలపండి. తర్వాత ఆ నీటితో స్నానం ఆచరించండి. ఇలా చేస్తే రుణ విముక్తి కలుగుతుంది.
  • ప్రతి నెలలో ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లండి. అక్కడ పంచామృతంతో లేదా ఆవుపాలతో అభిషేకం చేయించండి.
  • నెలకు ఒకసారి మంగళవారం రోజున లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించండి. లేదా స్వామి వారికి అభిషేకం చేయించండి. ఇలా చేస్తే అప్పుల బాధ తగ్గిపోతుంది.
  • ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టిన తర్వాత 'ఓం అం అంగారకాయ నమః' అని 21 సార్లు చదవండి. అంగారకుడి అనుగ్రహం కలిగి అప్పులన్నీ తీరిపోతాయని జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్​ చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

"మహిళలు సోమవారం ఇలా చేస్తే - మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది"!!

"ఇలా చేస్తే ఎంతటి నరదిష్టి అయినా - మిమ్మల్ని ఏమీ చేయలేదు!"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.