Bigg Boss 8 Telugu Dasara Special Episode: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 నేడు ఆరో వారం చివరికి వచ్చేసింది. ఇక ఆదివారం ఎపిసోడ్ అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎలిమినేషన్లు ఉంటాయని తెలిసిందే. అయితే ఈ వారం దసరా పండగ నేపథ్యంలో ఈరోజు మరింత స్పెషల్‌గా ఉండబోతుంది. తాజాగా దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ ప్రోమోలో కూడా ఎప్పటిలాగే స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఇక ఆ తర్వాత అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్పడంతో నేటి ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. ఇక ప్రోమోలో చూపించిన విధంగా కొద్దిసేపు అవినాష్‌తో ఆడుకున్నారు కింగ్. ఆ తర్వాత హౌజ్‌మేట్స్ అంతా కలిసి బతుకమ్మ ఆడడం. దసరా పండుగను సెలబ్రేట్ చేసుకోవడంతో హౌజ్ అంతా సందడి సందడిగా మారింది.
స్పెషల్ గెస్ట్‌లు: సాధారణంగా ఆదివారం రోజు బిగ్‌బాస్ ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. ఏమైనా స్పెషల్ ఉంటే రాత్రి 7 గంటలకే మొదలవుతుంది. గత వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీల ఎపిసోడ్ కూడా అప్పుడే మొదలుపెట్టారు. తాజాగా ఈ రోజు జరగనున్న దసరా స్పెషల్ ఈవెంట్ కూడా నైట్ 7 గంటలకు మొదలుకానుంది. ఇక స్పెషల్ ఎపిసోడ్ అంటే కేవలం కంటెస్టెంట్ల ఆటలు మాత్రమే కాదు.. హీరోయిన్ల డ్యాన్సులు, సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించి నటీనటులు కూడా వస్తుంటారు. తాజాగా నేటి ఎపిసోడ్లో కూడా పలువురు సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. వాళ్లేవరో చూస్తే..
మరో షాకిచ్చిన నాగ మణికంఠ - భార్య కంటే ఎన్నేళ్లు చిన్నోడో తెలుసా?
ముందుగా ఫరియా అబ్దుల్లా.. "క్యాచ్ మీ క్యాచ్ మీ" అనే సాంగ్‌కు డ్యాన్స్ వేసినట్లు చూపించారు. ఇక ఆ తర్వాత సింగర్ మంగ్లీ తన ఫేమస్ సాంగ్స్ పాటి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశారు. అంతే కాకుండా హౌజ్‌లోకి వెళ్లి కంటెస్టెంట్లతో కలిసి బతుకమ్మ ఆడారు. ఇక ఆ తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో రిలీజ్ అయిన తొలి సినిమా విశ్వం. ఇక ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా వీళ్లిద్దరూ బిగ్‌బాస్ స్టేజ్ మీదకు వచ్చినారు. నాగార్జున శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసిన కింగ్ సినిమా జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. హౌజ్‌లోని రాయల్ క్లాన్ సభ్యులు కింగ్ సినిమాలో బ్రహ్మానందం కామెడీని స్ఫూప్ చేశారు. ఇక ఆ తర్వాత డింపుల్ హయతి, అమృతా అయ్యర్ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సులు ఇచ్చారు.
కంటెస్టెంట్స్‌కి టాస్కులు కూడా గట్టిగానే ఇచ్చినట్టు ప్రోమోలో తెలుస్తుంది. అబ్బాయిలు అమ్మాయిలని ఉప్పు బస్తాలుగా ఎత్తుకొని చేసే టాస్క్ ఒకటి పెట్టారు. అలాగే పాటని బట్టి దాంట్లో ఉన్న వస్తువులను తెచ్చే టాస్క్ పెట్టారు. ఇలా పలు టాస్కులు అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది. అయితే సండే ఎపిసోడ్ ప్రోమోలు రెండు నిమిషాలు ఉంటే.. నేటి స్పెషల్ ఎపిసోడ్ కారణంగా ప్రోమోని చాలా పెద్దగా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో రిలీజ్ చేశారు. ప్రోమోనే ఇలా ఉంటే.. నేటి ఎపిసోడ్లో ఇంకెంత ఫన్ ఉంటుందో అని బిగ్‌బాస్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈరోజు కిరాక్ సీత ఎలిమినేట్ అవుతుందని సమాచారం. ఇక నేటి ఎపిసోడ్ చూడాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి..
బిగ్‌బాస్ 8: ఆరో వారం షాకింగ్ ఎలిమినేషన్ - టాప్‌లో ఉంటారనుకున్న కంటెస్టెంట్ మధ్యలోనే ఇంటికి!
బిగ్‌బాస్ 8 : లవ్ మ్యాటర్ రివీల్ చేసిన నబీల్ - పార్ట్నర్ ఆమేనటగా!