national

మెట్రోలో రూ.59లకే రోజంతా ప్రయాణం - ఈ ఆఫర్​ను పొడిగించేనా ?

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

UPER SAVER HOLIDAY SERVICES CARD
Metro Super Saver Holiday Card Ends (ETV Bharat)

Metro Super Saver Holiday Card Ends on September 29th : సెలవురోజుల్లో మెట్రోరైల్లో 59 రూపాయలకే సూపర్‌ సేవర్‌ హాలిడే కార్డు ద్వారా రోజంతా చేసే ప్రయాణానికి ప్రయాణికులు నుంచి మంచి స్పందన ఉంది. ఈ నెల 28, 29వ తేదీతో ఈ పథకం ముగుస్తుంది. దీంతో ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు సంస్థ హాలిడే కార్డును పొడిగిస్తుందా? లేదా? అనేది చూడాలి. గతంలో బతుకమ్మ పండగరోజు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒకటి రెండుసార్లు కూడా పొడిగించారు.

మరి ఈసారి కూడా ఈ పథకాన్ని పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇటీవల మెట్రోలో ప్రయాణికుల కోటిన్నరకు చేరింది. రెండు కోట్లకు చేరుకోవాలనేది మెట్రో లక్ష్యం. అందుకు మరింత కాలం సూపర్‌ సేవర్‌ హాలిడే కార్డు ఆఫర్‌ను పొడిగించడంతో పాటు ఉద్యోగులకు, విద్యార్థులకు నెలవారీ పాసులు ఇవ్వాలి కోరతున్నారు.

ABOUT THE AUTHOR

...view details