ETV Bharat / politics

ప్రభుత్వానికి కూల్చివేత తప్ప పూడ్చివేత చేతకాదు : హరీశ్​రావు - Harish Rao Slams Congress Govt - HARISH RAO SLAMS CONGRESS GOVT

Harish Rao On Congress : కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూల్చడమే తప్పించి, పూడ్చటం రాదంటూ మాజీమంత్రి హరీశ్​రావు విమర్శించారు. సాగర్‌ కాలువ గండి పడి 22 రోజులవుతున్నా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ కేసులు నమోదు చేయలేదన్న ఆయన, ఏపీలో అధికారులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

Harish Rao about BRS Attack Cases in Telangana
Harish Rao On Congress (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 1:30 PM IST

Updated : Sep 23, 2024, 1:41 PM IST

Harish Rao about BRS Attack Cases in Telangana : ఖమ్మం జిల్లాలో పంటపొలాలు ఎండిపోతున్నాయని మాజీమంత్రి హరీశ్​రావు అన్నారు. కృష్ణా నది పరవళ్లు తొక్కుతున్నా జిల్లాలో పొలాలు ఎండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు జలాశయానికి 100 మీటర్ల దిగువన సెప్టెంబర్‌ 1న కాలువకు గండి పడిందని తెలిపారు. గండి పడి 22 రోజులవుతున్నా పూడ్చలేదని ధ్వజమెత్తారు. సాగర్‌ నిండుకుండలా ఉన్నా సాగర్‌ ఆయకట్టు రైతుల పంటలు ఎండుతున్నాయని, పోయిన ఏడాది వర్షాలు పడక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్ల పంటలు ఎండుతున్నాయని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పోయిన ఏడాది ప్రకృతి కరవు తెస్తే ఇప్పుడు కాంగ్రెస్‌ కరవు తెచ్చిందని హరీశ్​రావు వ్యాఖ్యానించారు. పంటలు ఎండబెట్టడమే తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఖమ్మం ప్రజలకు ఇచ్చే బహుమానమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు చేతకాదని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూలుస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వరదల్లో పంట నష్టపోయిన రైతులతో సమానంగా పంట ఎండిపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా సాగర్‌ కాలువ గండి పూడ్చి రైతులకు నీళ్లు ఇవ్వాలని హరీశ్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

'ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేశారు? తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించడం పాపమా? యుద్ధప్రాతిపదికన గండి పూడ్చి మిగిలిన పంటలనైనా కాపాడండి. బీఆర్​ఎస్​ తరపున ఒక బృందం ఖమ్మం వెళ్లి రైతులకు భరోసా కల్పిస్తాం' - హరీశ్​రావు, మాజీమంత్రి

రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తోంది : తమపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేదని మాజీమంత్రి హరీశ్​రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారులు రెచ్చిపోవద్దని హితవు పలికారు. గతంలో ఆంధ్రాలో అధికారులు రెచ్చిపోయారని, ప్రస్తుతం సస్పెండ్‌ అవుతున్నారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అధికారులకు ఏపీలో పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

నర్సాపూర్​లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి బాధాకరమని హరీశ్​రావు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తోందని, ఇంటిపైకి వెళ్లి దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పది నెలల్లో రాష్ట్రంలో 2 వేల అత్యాచారాలు జరిగాయని తెలిపారు. జ్వరాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తాను బీఆర్ఎస్​లోనే ఉన్నానని గాంధీ చెప్పారని, కానీ మంత్రి శ్రీధర్ బాబు తన తెలివితేటలతో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

'బీఆర్​ఎస్ హయాంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి' : పొన్నం వ్యాఖ్యలకు హరీశ్​రావు కౌంటర్ - Harish Rao on kaleshwaram project

'రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలో లేదు' - Harish Rao Fires On Congress

Last Updated : Sep 23, 2024, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.