ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: "అది కంప్లైంట్​ చేయడానికి నువ్వు ఎవరు" - నబీల్​ వర్సెస్​ సోనియా! - నామినేషన్ల రచ్చ - Bigg Boss 8 Fourth Week Nominations - BIGG BOSS 8 FOURTH WEEK NOMINATIONS

Bigg Boss 8 Nominations: బిగ్​బాస్​ సీజన్​ 8 మొదలై మూడు వారాలు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు హౌజ్​ నుంచి ముగ్గురు ఎలిమినేట్​ కాగా.. నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్​ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్​ అయ్యింది.

Bigg Boss Season 8
Bigg Boss Season 8 (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 23, 2024, 1:42 PM IST

Bigg Boss 8 Fourth Week Nominations: బిగ్‌బాస్ హౌజ్​లో ఆదివారం ఎపిసోడ్​ తర్వాత అందరూ ఎదురుచూసేది సోమవారం జరిగే నామినేషన్​ ప్రక్రియ కోసమే. ఇప్పటికే మూడు వారాలు పూర్తయిన బిగ్​బాస్​ సీజన్​ 8.. నాలుగో వారానికి ఎంటర్​ అయ్యింది. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్​ బాషా, మూడో వారం అభయ్​ నవీన్​ ఎలిమినేట్​ కాగా.. నాలుగో వారం ఇంటి నుంచి ఒకరిని బయటికి పంపేందుకు నామినేషన్స్​ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్​ అయ్యింది. ఈ ప్రోమోలో చూపించిన విధంగా నబీల్​, సోనియా, పృథ్వీ మధ్య వాదనలు గట్టిగానే జరిగాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈ వారం థీమ్​ ఇదే: ప్రతి వారంలానే ఈ వారం నామినేషన్స్‌కి కూడా ఓ థీమ్ ఇచ్చాడు బిగ్‌బాస్. గత వారం చెత్త మీద పోసి నామినేట్​ చేయాలని చెప్పిన బిగ్​బాస్​.. ఈ వారం నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి సభ్యుల ముఖంపై ఫోమ్​ స్ప్రే కొట్టాలని చెప్పి నామినేషన్స్​ ప్రక్రియ మొదలు పెట్టమని చెప్పాడు.

ముందుగా పృథ్వీని నామినేట్​ చేశాడు ఆదిత్య. వీరిద్దరి మధ్య కాసేపు డిస్కషన్​ నడిచింది. ఇక ఆ తర్వాత సోనియాను నామినేట్ చేశాడు ఆదిత్య. ఫస్ట్ 3 డేస్‌లో కనిపించిన సోనియా తర్వాత కనిపించలేదు అంటూ ఆదిత్య తన పాయింట్ చెప్పాడు.

ఆ తర్వాత నబీల్.. కూడా సోనియానే నామినేట్ చేశాడు. "నేను సంచాలక్‌గా ఉన్నప్పుడు.. నువ్వు గట్టి గట్టిగా నా మీదే చెప్తున్నావ్.. ఈడ నరాలన్నీ కనిపిస్తున్నాయ్.. అందుకే నా మాట నీకు ఇనిపీయట్లే.. నన్ను బెదిరించినవ్" అంటూ నబీల్ చెబుతుంటే సోనియా మధ్యలో మాట్లాడబోయింది. దీంతో నా పాయింట్ అయిపోని.. ఓహో మేడమ్.. అంటూ నబీల్ గట్టిగానే వాదించాడు.

హౌజ్​మేట్స్​ కాపాడినా ప్రేక్షకులు కరుణించలేదు - మూడో వారం అభయ్​​ ఎలిమినేట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

ఇక తన రెండో నామినేషన్ పృథ్వీకి వేశాడు నబీల్. తాను సంచాలక్‌గా ఉన్న ప్రభావతి 2.0 టాస్కులో తనపైకి కొట్టడానికి వచ్చినట్లు కోపంగా వచ్చాడని.. అగ్రెషన్ ఎక్కువైందంటూ పాయింట్ చెప్పాడు నబీల్. దీనికి నువ్వు బయాస్‌డ్ (పక్షపాతం)‌గా ఉన్నావంటూ మళ్లీ మీదకి వచ్చాడు పృథ్వీ. దీంతో కొంచెం వెనక్కెళ్లి మాట్లాడు అంటూ నబీల్ అనడంతో నేను ఇక్కడ ఉంటా.. ఇంకా ముందుకొస్తా అంటూ మరోసారి అగ్రెసివ్ అయ్యాడు పృథ్వీ.

ఇక తర్వాత నైనిక.. మణికంఠను నామినేట్ చేసింది. "నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ల కాన్ఫిడెన్స్ డౌన్ చేయకు" అంటూ సలహా ఇచ్చింది. మరో నామినేషన్ ఆదిత్యకు వేసింది.

​తర్వాత తనను నామినేట్ చేసిన నబీల్‌కి రివెంజ్ నామినేషన్ వేసింది సోనియా. ప్రభావతి 2.0 టాస్కులో ఫస్ట్ రౌండ్‌లో నువ్వే మీదమీద పడి ఎత్తిపడేసినవ్ అమ్మాయిలను.. అంటూ సోనియా అంది. దీనికి "మరి అక్కడ ఆల్ రెడీ గొడవ నడుస్తాంది.. ఇక్కడొచ్చి నువ్వు ఎగ్స్ తీసుకుపోయావ్ కదా మా టీమ్‌వి.. అప్పుడు నేను తప్పు.. నేను ఫేక్.. అయ్యో.. నేను ఎత్తిపడేసినా.. అంటూ సోది చెబుతున్నావేంటి అంటూ నబీల్ మరోసారి ఇచ్చిపడేశాడు. ఇక నబీల్ చేసిన యాక్షన్‌కి, డైలాగులకి సోనియా సైలెంట్​ కాగా.. యష్మీ పగలబడి నవ్వింది. ఇలా ఈ వారం నామినేషన్లు కూడా హాట్ హాటుగా సాగినట్లు సమాచారం. మరి ఎంతమంది నామినేషన్లలోకి వచ్చారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

బిగ్​బాస్​ 8: వైల్డ్​కార్డ్​ ఎంట్రీ బ్యాచ్​ సిద్ధం! - వచ్చేది వీళ్లేనటగా!

బిగ్​బాస్​ 8: శేఖర్​ బాషా ఎలిమినేషన్​కు అసలు కారణం ఇది! - రెమ్యునరేషన్​ వివరాలు కూడా లీక్​

బిగ్ బాస్ 8 : నాగమణికంఠ భార్య ఎవరో తెలిసిపోయిందిగా - పెళ్లి వీడియో వైరల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.