How to Make Veg Bhurji Recipe : మెజార్టీ పీపుల్‌కు ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేసుకోవడం తెలుసు.. కానీ, గుడ్డు(Egg) లేకుండా కూడా బుర్జీ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అది కూడా 100 శాతం ప్యూర్ వెజ్‌తో అద్దిరిపోయే టేస్ట్‌తో రెడీ చేసుకోవచ్చు! పులావ్, చపాతీ, రోటీ, అన్నం ఇలా ఎందులోకైనా ఈ బుర్జీ టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా ఈ రెసిపీ కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు! చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ, వెజ్ బుర్జీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వెజ్ బుర్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు :
- శనగపిండి- కప్పు
- బియ్యం పిండి- పావు కప్పు
- ఉప్పు- రుచికి సరిపడా
- నూనె
- కరివేపాకు-2 రెమ్మలు
- ఉల్లిపాయ-1 (సన్నగా కట్ చేసుకోవాలి)
- జీలకర్ర- అరటీస్పూన్
- అల్లం తురుము- టీస్పూన్
- పచ్చిమిర్చి-3
- టమాటాలు-2
- కారం-టీస్పూన్
- ధనియాలపొడి- టీస్పూన్
- గరం మసాలా -అరటీస్పూన్
- మిరియాలపొడి-పావు టీస్పూన్
- కొత్తిమీర
- నిమ్మరసం
తయారీ విధానం :
- ముందుగా ఒక గిన్నెలో శనగ పిండి, బియ్యం పిండి వేసి కలపండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నీళ్లను పోసుకుంటూ.. దోశల పిండి కంటే కాస్త జారుగా కలుపుకోండి. దీనిని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి 2 టేబుల్స్పూన్ల ఆయిల్ వేయండి. ఇందులో జీలకర్ర, అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపండి. తర్వాత టమాటా ముక్కలు, కారం, ధనియాలపొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపండి.
- టమాటాలు ఉడికిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిశ్రమం పోసుకోండి. గిన్నె అంచుల వెంట, పైన కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి.. సన్నని మంట మీద శనగ పిండి ఉడికించుకోండి.
- ఐదు నిమిషాల తర్వాత పిండిపైన గరిటెతో అక్కడక్కడా చిన్న హోల్స్ చేసుకోండి. ఇలా చేస్తే పిండి లోపల కూడా చాలా చక్కగా కుక్ అవుతుంది.
- శనగపిండి ఉడికిన తర్వాత పిండిని చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని కలుపుకోవాలి.
- ఇప్పుడు మంట కాస్త పెంచి పిండిలో చెమ్మ ఆరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
- స్టౌ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని దింపేసుకుంటే సరిపోతుంది.
- అంతే.. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బుర్జీ మీ ముందుంటుంది. నచ్చితే.. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినేస్తారు.
ఇవి కూడా చదవండి :
క్రిస్పీ అండ్ స్పైసీ సేమియా వెజ్ కట్లెట్స్ - ఇలా చేశారంటే మమ్మీ ఇట్స్ టూ యమ్మీ అనడం పక్కా!
నోరూరించే పులావ్- ఇలా చేశారంటే వహ్వా అంటూ ప్లేట్లు నాకాల్సిందే!