ETV Bharat / offbeat

ఎగ్స్​తో రొటీన్ కర్రీ ఎందుకు?​ - దాబా స్టైల్​ "ఎగ్​ కీమా మసాలా" ట్రై చేయండి - రుచి అద్దిరిపోవాల్సిందంతే! - How to Prepare Egg Keema Masala - HOW TO PREPARE EGG KEEMA MASALA

Egg Keema Masala: ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయంటే.. చాలా మంది రొటీన్ రెసిపీలే చేస్తుంటారు. ప్రతిసారీ ఒకేరకం తింటే ఏం బాగుంటుంది? అందుకే ఈ సారి.. దాబా స్టైల్ ఎగ్​ కీమా మసాలా ప్రిపేర్​ చేయండి. లొట్టలేసుకుంటూ లాగిస్తారు. మరి, దీన్ని ప్రిపేర్​ చేసే విధానం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Egg Keema Masala
Egg Keema Masala (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 23, 2024, 11:28 AM IST

How to Prepare Egg Keema Masala: కీమా అనగానే చాలా మందికి మటన్, చికెన్​ కీమానే గుర్తుకు వస్తుంది. కానీ కోడి గుడ్లతో కీమా అద్దిరిపోతుంది. దాబాల్లో ఈ రెసిపీ ఎక్కువగా కనిపిస్తుంది. టేస్ట్ అమోఘంగా ఉంటుంది. పులావ్, చపాతీ, రోటీ, అన్నం ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్​గా సెట్​ అవ్వుద్ది. మరి, ఈ ఎగ్ కీమా మసాలా కర్రీని ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • కోడిగుడ్లు - 4
  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 4
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టీ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​
  • టమాటలు - 2 (మీడియం సైజ్​)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వేయించిన జీలకర్ర పొడి - అర టీ స్పూన్​
  • కారం - 1 టీ స్పూన్​
  • గరం మసాలా - అర టీ స్పూన్​
  • మిరియాల పొడి - పావు టీ స్పూన్​
  • ధనియాల పొడి - అర టీ స్పూన్​
  • క్యాప్సికం - 1
  • నీరు - అర కప్పు
  • కొత్తిమీర తురుము - కొద్దిగా
  • అల్లం తరుగు - 1 టీ స్పూన్​
  • పచ్చిమిర్చి తరుగు - 1 టీస్పూన్​
  • నిమ్మరసం - అర చెక్క
  • బటర్​ లేదా నెయ్యి - 1 టేబుల్​ స్పూన్​

ఫ్లఫ్పీ ఆమ్లెట్ : ఇతర పదార్థాలేమీ అవసరం లేదు - పెద్ద సైజ్ బన్​లాగా పొంగుతుంది - ఇలా ప్రిపేర్ చేయండి!

తయారీ విధానం:

  • ముందుగా కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం, టమాట ముక్కలను సన్నగా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడించుకోవాలి.
  • ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి హై ఫ్లేమ్​ మీద ఫ్రై చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు పచ్చివాసన పోయి లైట్​ గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత టమాటా తరుగు వేసి కలుపుకోవాలి. అనంతరం ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి టమాట ముక్కల నుంచి స్కిన్​ సెపరేట్​ అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి.
  • టమాటా ముక్కలు మగ్గి నూనె పైకి తేలిన తర్వాత క్యాప్సికం ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అరకప్పు వాటర్ పోసి హై-ఫ్లేమ్​ మీద కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.
  • నీరు సగానికి అయిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లను పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేటర్​ సాయంతో కూరలో తురుముకోవాలి. ​ఆ తర్వాత కొత్తిమీర చల్లి మరో సారి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, నెయ్యి వేసి బాగా కలిపి ఉప్పు రుచి చూసి దింపేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్​ కీమా మసాలా రెడీ.

నోటికి ఏమీ రుచించకపోతే - ఈ "కోడిగుడ్డు వెల్లుల్లి కారం" టేస్ట్ చేయండి - కచ్చితంగా ఫిదా అయిపోతారు!

కోడిగుడ్డు పులుసు ఇలా కదా ప్రిపేర్ చేసేది! - టేస్ట్ వేరే లెవల్

ఎగ్​ దోశ చేయడం ఇప్పుడు చాలా ఈజీ - ఈ టిప్స్ పాటించండి - టేస్ట్​ ఎంజాయ్​ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.