ETV Bharat / offbeat

నోరూరించే 'దొండకాయ 65' - నిమిషాల్లోనే రెడీ అవుతుంది - టేస్ట్ వేరే లెవల్! - How to Make Dondakaya 65 Easily - HOW TO MAKE DONDAKAYA 65 EASILY

Dondakaya65: దొండ‌కాయ‌ల‌తో వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో ఒకటే.. దొండ‌కాయ-65. ఇందులో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి టేస్ట్ అద్దిరిపోతుంది. రెండోది దొండకాయలు సన్నగా కట్​ చేసుకోవాల్సిన పనిలేదు. మరి.. ఈజీగా పూర్తయ్యే ఈ రెసిపీపై ఓ లుక్కేయండి.

Dondakaya 65
How to Make Dondakaya 65 With Easy Tips (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 23, 2024, 1:56 PM IST

How to Make Dondakaya 65 With Easy Tips: శుభకార్యాల్లో, విందు భోజనాల్లో వడ్డించే దొండకాయ 65ని పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. సైడ్​ డిష్​గా, స్నాక్ గా ఎలాగైనా బాగుంటుంది. మరి.. దీన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • దొండకాయలు - పావు కిలో
  • పచ్చిమిర్చి - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • గరం మసాలా - 1 చెంచా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • కారం - అర చెంచా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - పావు చెంచా
  • కార్న్​ఫ్లోర్​ - పావు కప్పు
  • నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా
  • కరివేపాకు - 3 రెబ్బలు
  • పల్లీలు - పావు కప్పు
  • జీడిపప్పు - పావు కప్పు
  • వేయించిన జీలకర్ర పొడి- పావు చెంచా
  • కారం - అర టీ స్పూన్​
  • ధనియాల పొడి - అర టీ స్పూన్​

వెడ్డింగ్​ స్టైల్​​ క్యాబేజీ 65 - ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే సూపర్​ క్రిస్పీ అండ్​ టేస్ట్​ గ్యారెంటీ!​

తయారీ విధానం:

  • ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి చివర్లు కట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కాయలను నిలువుగా చీరేసి మిక్సీలో వేసేయాలి.
  • పచ్చిమిర్చి కూడా వేసి కచ్చాపచ్చగా గ్రైండ్​ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఈ దొండకాయ మిశ్రమంలో ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసుకుని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత మొక్కజొన్న పిండి వేసి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఈ లోపు ఓ పైపింగ్​ బ్యాగ్​​ తీసుకుని అందులో దొండకాయ మిశ్రమాన్ని పెట్టుకుని.. రబ్బర్​ వేసుకోవాలి. ఆ తర్వాత పైపింగ్​ బ్యాగ్​ చివర్లు కట్​ చేసుకుని.. కాగుతున్న నూనెలో చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్​ మీద గోల్డెన్​ కలర్​ వచ్చేవరకు వేయించుకని పక్కకు పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకోవాలి.
  • ఒకవేళ మీ దగ్గర పైపింగ్​ బ్యాగ్​ లేకపోతే చేత్తో అయిన చిన్న చిన్న ఉండలుగా వేసుకోవచ్చు.
  • ఇప్పుడు అదే నూనెలో పల్లీలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. అదే విధంగా జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి.
  • ఇప్పుడు దొండకాయ ముక్కల్లోకి వేయించిన పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి టాస్​ చేసుకుంటే సరి. కేవలం నిమిషాల్లోనే టేస్టీ అండ్​ క్రంచీ దొండకాయ 65 రెడీ!

ఎన్నిసార్లు చేసినా "ఆలూ ఫ్రై" క్రిస్పీగా రావడం లేదా? - ఓసారి ఇలా ట్రై చేస్తే క్రిస్పీతో పాటు సూపర్​ టేస్ట్​!

మసాలా ఫిష్ ఫింగర్స్.. ఈ సండే అద్భుతమైన స్నాక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.