national

ETV Bharat / snippets

జీపీ, ఎస్​జీపీ, పీపీల నియామకాలపై హైకోర్టులో పిటీషన్​ - రెండు వారాలకు వాయిదా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 7:48 PM IST

hc_on_pp_appointments
hc_on_pp_appointments (ETV Bharat)

High Court Hearing on Petition of GP, SGP and PP Appointments in Courts:న్యాయస్థానాల్లో జీపీ, ఎస్​జీపీ, పీపీల నియామకాల్లో నియమ నిబంధనలు లేవని వాటిని రూపొందించి అమలు చేయాలని న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. రాజకీయ పార్టీల ప్రోద్భలంతో ఈ నియామకాలు చేపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టడానికి నియమ నిబంధనలు రూపొందించాలని కోర్టును కోరారు. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details