బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు కనువిందు చేస్తున్న ఫలపుష్ప ప్రదర్శనశాల - flowers exhibition in Tirumala
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2024, 10:41 PM IST
Flowers Exhibition in Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఆహ్లాదాన్ని అందించేందుకు టీటీడీ అధికారులు పుష్పఫలశాలను ఏర్పాటు చేశారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాలను ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఫలపుష్ప ప్రదర్శనశాల కనువిందు చేస్తోంది.
మరోవైపు తిరుమలలో బ్రహ్మోత్సవాల ఘనంగా జరుగుతున్నాయి. అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం శ్రీవారి వాహన సేవలు ప్రారంభమయ్యాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిగింది. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడపటాన్ని ఎగురేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి సతీసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేసి, లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ముందుగా బేడి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన సీఎం, వెండి పళ్లెంలో పట్టువస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.