ETV Bharat / spiritual

నవరాత్రుల వేళ అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించాలి? - పూజకు ఏ పువ్వులు వాడకూడదు? - Devi Navaratri 2024 in Telugu - DEVI NAVARATRI 2024 IN TELUGU

Devi Navaratri: దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరి అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించవచ్చు? ఏ పుష్పాలతో పూజించకూడదు? ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఇలాంటి ప్రశ్నలకు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ సమాధానమిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Devi Navaratri 2024 in Telugu
Devi Navaratri 2024 in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 2, 2024, 7:40 PM IST

Devi Navaratri 2024 in Telugu: దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో ఆరాధిస్తుంటారు. ఈ సమయంలోనే ప్రత్యేకమైన ప్రసాదం, వివిధ రకాల పూలతో పూజిస్తుంటారు. ఇలా నవరాత్రుల్లో అమ్మవారిని ఈ ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల పుష్పాలు మాత్రం అమ్మవారి పూజకు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని దేవీ భాగవతంలో చెప్పినట్లు పేర్కొన్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాడకూడని పుష్పాలు:

గరిక: దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవిని గరికపోచలతో పూజించకూడదని కిరణ్ కుమార్ తెలిపారు. దుర్గాదేవి ఉగ్ర స్వరూపంగా ఉంటుందని... గరికలో ఉష్ణాన్ని తగ్గించే గుణం ఉంటుందని.. కాబట్టి ఆమె ఉగ్రత్వాన్ని తగ్గించే గరికపోచలతో దుర్గాదేవిని పూజించకూడదంటున్నారు.

మల్లెపూలు: ఇదే కాకుండా చండీ అమ్మవారు కూడా ఉగ్రత్వంతో ఉంటుందని.. ఆమెను శాంతింపచేసేలా మల్లెపూలతో పూజించరాదని తెలిపారు. అయితే, చండీ దేవత మినహ ఇతర దేవతా స్వరూపాలను నవరాత్రుల్లో మల్లెపూలతో పూజిస్తే విశేషమైన ధనప్రాప్తి పెరుగుతుందని.. వృథా ఖర్చులు తగ్గిపోతాయని చెబుతున్నారు.

పూజించాల్సిన పుష్పాలు ఇవే:

పద్మ పుష్పాలు: పద్మ పుష్పాలతో నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు. పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని దేవీ భాగవతంలో చెప్పినట్లు పేర్కొన్నారు.

గన్నేరు పూలు: దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని గన్నేరు పూలతో పూజిస్తే మంత్ర సిద్ధి త్వరగా కలుగుతుంగదని చెబుతున్నారు. ఇంకా సినీ, రాజకీయ, సోషల్ మీడియా ఇన్​ప్లూయెన్సర్లు.. ముఖ్యంగా ఎర్ర గన్నేరు పూలతో పూజిస్తే విపరీతమైన జనాకర్షణ, ప్రజాదరణ కలుగుతుందని తెలుపుతున్నారు.

సన్న జాజిపూలు: వాక్​శుద్ధి ఉండాలంటే సన్న జాజి పూలతో అమ్మవారిని పూజించాలని చెబుతున్నారు.

తుమ్మిపూలు: తుమ్మిపూలతో అమ్మవారిని పూజిస్తే అన్నపానాలకు లోటు లేకుండా ఉంటుందని చెబుతున్నారు.

జిల్లెడు, ఎర్ర తామర పూలు: నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున జిల్లెడు పూలు, ఎర్ర తామర పూలతో అమ్మవారిని పూజిస్తే మన కోరికలు వెంటనే నెరవేరుతాయని 'దేవీ తంత్రం' అనే గ్రంథంలో చెప్పినట్లు పేర్కొన్నారు.

పారిజాత పుష్పం: కాలసర్ప దోష తీవ్రతను తగ్గించుకోవడానికి అమ్మవారిని పూజించేటప్పుడు పారిజాత పుష్పం సమర్పించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే దోషం నుంచి బయట పడవచ్చని వివరిస్తున్నారు.

ఎర్ర మందార పూలు: ఎదుటి వారి ఏడుపు, దిష్టి, అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నవారు ఎర్ర మందారాలతో పూజిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయని వివరించారు.

ఇవి కాకుండా కొన్ని పత్రాలు కూడా అమ్మవారికి సమర్పిస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఇందులో తులసి, మరువం, దవణం ఆకులను సమర్పిస్తే ధన లాభం కలుగుతుందని తెలిపారు.

మరువం: అమ్మవారి చిత్రపటం దగ్గర మరువం పెట్టి నమస్కరిస్తే ఆదాయ మార్గాలు పెరిగి.. వృథా ఖర్చులు తగ్గిపోతాయని చెబుతున్నారు.

దవణం: అమ్మవారికి పూల మాలలు కట్టేటప్పుడు దవణ పత్రాలను ఉంచి వాటిని దేవతకు సమర్పిస్తే కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని తెలిపారు.

తులసి ఆకులు: నవరాత్రుల్లో సరస్వతి, లక్ష్మీ, పార్వతీ దేవిని తులసి ఆకులతో పూజిస్తే మనోబీష్టాలు త్వరగా నెరవేరుతాయని నీల తంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పినట్లు పేర్కొన్నారు.

ఉసిరిక: ఉసిరిక చెట్టు ఆకులతో శివపార్వతుల ఫొటోలోని పార్వతీ దేవిని పూజిస్తే తక్షణమే మన కోరికలు నెరవేరుతాయని 'శక్తి యామిళము' అనే గ్రంథంలో చెప్పినట్లు పేర్కొన్నారు. ఇలా కాకుండా తమలపాకులో పసుపు ముద్ద ఉంచి పైన, కుడి, ఎడమ వైపు కుంకుమ బొట్టు పెట్టి పార్వతీ దేవీ స్వరూపంగా భావించి ఉసిరిక చెట్టు ఆకులతో పూజించాలని చెబుతున్నారు.

ఇలా పుష్పాలు, పత్రాలతో అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొంది.. సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చని చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

నవరాత్రి స్పెషల్ : అమ్మవారు మెచ్చే "నువ్వులన్నం" - ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి! - Navratri Special Recipe

"నవరాత్రులూ పూజ చేయలేని వారు - ఈ ఒక్కరోజు దుర్గాదేవిని ఆరాధించినా అద్భుత ఫలితాలు పొందుతారట!" - Navratri 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.