ETV Bharat / offbeat

దసరా సెలవుల్లో లాంగ్​ టూర్​ ప్లాన్​ చేస్తున్నారా? - ఈ స్పాట్స్​పై ఓ లుక్కేయండి గురూ - పక్కా చిల్​ అయిపోతారు! - Tourist Places for Long Vacation

Best Tourist Places: పిల్లలకు దసరా సెలవులు వచ్చాయి. దీంతో చాలా మంది పేరెంట్స్​ లాంగ్​ టూర్లు ప్లాన్​ చేస్తుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్​లో ఉన్నారా? అయితే మీ కోసం దేశంలోని కొన్ని బెస్ట్​ టూరిస్ట్​ ప్లేస్​లు తీసుకొచ్చాం. ఇక్కడికి వెళితే మిమ్మల్ని మీరు మర్చిపోవడం గ్యారెంటీ..!

Best Tourist Places
Best Tourist Places (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 4:09 PM IST

Best Tourist Places for Long Vacation in October: బిజీ బిజీ రోజుల నుంచి కాస్త రిలాక్సేషన్​ పొందేందుకు వెకేషన్​ ప్లాన్​ చేస్తుంటారు చాలా మంది. ముఖ్యంగా అక్టోబర్​ సమయంలో పిల్లలకు సెలవులు ఎక్కువగా వస్తుండటంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో ఎంజాయ్​ చేసేందుకు లాంగ్​ టూర్ వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. మరి, ఈ లిస్టులో మీరు కూడా ఉన్నారా? అయితే.. మీ కోసం కొన్ని బెస్ట్​ టూరిస్ట్​ స్పాట్లను తీసుకొచ్చాం. అక్కడికి వెళితే ప్రకృతి అందాల మధ్య మీరు చిల్​ అయిపోవడం గ్యారెంటీ. మరి, ఆ ప్లేసు​లు ఏంటి? ఎలా చేరుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం..

మౌంట్ అబూ: రాజస్థాన్​లోని ఈ పర్యాటక ప్రదేశం ఎంతో మందికి ఇష్టం​. ఫ్యామిలీతో ఎంజాయ్​ చేయాలనుకునే వారు ఇక్కడికి వెళ్లొచ్చు. అర్బుద దేవి ఆలయం, నక్కి లేక్, టోడ్ రాక్, అచల్‌గఢ్ కోట.. ఇలా ఒక్కటేమిటి అక్కడి ప్రకృతి అందాలు, రాజస్థాన్​ రాజసం చూపు తిప్పుకోకుండా చేస్తుంది.

వయనాడ్: పచ్చని కొండలు, ప్రకృతి అందాలకు కేరాఫ్​ అడ్రెస్​ వయనాడ్​. లాంగ్​ టూర్​ ప్లాన్​ చేసే వాళ్లు ఇక్కడికి వెళ్లి ఫుల్​ ఎంజాయ్​ చేయవచ్చు. ప్రకృతి అందాలతో రమణీయంగా కనిపించే ట్రీ హౌజ్​, వత్తిరి, చెంబ్రా శిఖరం, కురువా ద్వీపం, తిరునెల్లి ఆలయం వంటి ప్రసిద్ధ ప్రదేశాలను వయనాడ్‌లో చూడవచ్చు.

ఐఆర్​సీటీసీ "మ్యాజికల్​ మధ్యప్రదేశ్​" - సాంచి స్థూపంతో పాటు ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర చాలా తక్కువ!

మున్నార్​: ప్రకృతి అందాలతో కన్నుల విందు చేసే మున్నార్.. టూరిస్టులకు బెస్ట్​ ప్లేస్​. ఇక్కడ టూరిస్టులు ప్రత్యేక అనుభూతి పొందుతారు. మున్నార్‌లోని కొండలపై తేయాకు తోటలు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హౌస్‌బోట్‌తో సహా అద్భుతమైన కొండలు, కనువిందు చేసే జలపాతాలు ప్రత్యేకతలు. మున్నార్‌ను "దక్షిణ భారతదేశపు కాశ్మీర్" అని కూడా పిలుస్తుంటారు.

గోవా: గోవా ట్రిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ఇక్కడికి వెళ్లి ఎంజాయ్​ చేస్తుంటారు. మరి మీరు కూడా అక్టోబర్​లో ఇక్కడికి వెళ్లి ఎంజాయ్​ చేయవచ్చు. లాంగ్ ట్రిప్ కోసం గోవా ఉత్తమ పర్యాటక ప్రాంతం. బీచ్​లు, షాపింగ్​, వైల్డ్​ లైఫ్​ సఫారీలు, స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, జెట్ స్కీయింగ్, వాటర్​ ఫాల్స్​.. ఇలా ఒక్కటేమిటి గోవా వెళితే ఎంజాయ్​ చేయాల్సిన ప్లేస్​లు చాలానే ఉన్నాయి.

ఇలా ప్లాన్ చేసుకోండి : సీజన్ మారే కాలం కావడంతో అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వెళ్లాలనుకున్న పర్యాటక ప్రాంతం గురించి ముందుగానే సమాచారాన్ని సేకరించుకోండి. అడ్వాన్స్‌గా హోటల్ బుక్ చేసుకోండి. అన్ని పర్యాటక ప్రాంతాలకు బస్సులు, రైళ్లు, విమాన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అయితే.. ప్రాంతాన్ని బట్టి ఇవి మారుతుంటాయి. కాబట్టి సౌకర్యవంతంగా ఉండేలా ట్రిప్ ప్లాన్ చేసుకోండి. IRCTC కూడా దేశంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల మీదుగా రైళ్లు నడుపుతోంది.

IRCTC అద్దిరిపోయే టూర్ - మధుర మీనాక్షి ఆలయంతోపాటు మరెన్నో ప్రదేశాల సందర్శన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.