ETV Bharat / spiritual

అహంకారాన్ని అణచివేసే విష్ణురూపం- హంస వాహనంపై మలయప్పస్వామి ఊరేగేది అందుకే! - 2024 Srivari Brahmotsavam - 2024 SRIVARI BRAHMOTSAVAM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మలయప్ప స్వామి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ సందర్భంగా హంస వాహనం విశిష్టతను తెలుసుకుందాం.

Srivari Bramhotsavalu
Srivari Hamsa Vahana Seva (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 4:24 AM IST

Tirumala Srivari Brahmotsavam Day 2 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేవదేవుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల (అక్టోబర్) 5వ తేదీ శనివారం సాయంత్రం జరగనున్న వాహన సేవలో భాగంగా మలయప్ప స్వామి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ సందర్భంగా హంస వాహనం విశిష్టతను తెలుసుకుందాం.

హంస వాహనంపై వీణాపాణియై
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతి మూర్తి అవతారంలో దర్శనమిస్తారు.

హంస వాహన విశిష్టత
బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతిని కలిగిస్తాడని విశ్వాసం.

ఇదే హంస వాహన ప్రత్యేకత
హంస వాహనంపై ఊరేగే శ్రీనివాసుని దర్శిస్తే అహంకారం పటాపంచలైపోతుంది. ఎలాగైతే హంస పాలను నీళ్లను వేరు చేస్తుందో అలాగే ఏది మంచో, ఏది చెడో గ్రహించగల విచక్షణ కలిగించే భాగ్యాన్ని ఆ శ్రీనివాసుడు ప్రసాదిస్తాడు. అదే హంస వాహన సేవ పరమార్ధం. ఇది గహించడమే మన జీవితానికి పరమార్ధం.

మానవాళికి సద్భుద్ది, జ్ఞానాన్ని ప్రసాదించమని హంస వాహనంపై ఊరేగే శ్రీనివాసుని ప్రార్ధిస్తూ ఓం నమో వెంకటేశాయ!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.