ETV Bharat / sports

15 పరుగులు, సున్నా వికెట్లు - అయినా ఆ మ్యాచ్​ హీరోగా నిలిచిన సచిన్‌! - Sachin Tendulkar Match Winning Hero - SACHIN TENDULKAR MATCH WINNING HERO

ఓ మ్యాచ్​లో పరుగులు చేయకపోయినా, వికెట్లు తీయకపోయినా మ్యాచ్​ హీరోగా నిలిచిన సచిన్​ తెందుల్కర్​.

source Getty Images
Sachin Tendulkar (source Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 4, 2024, 10:43 PM IST

Sachin Tendulkar 1993 Hero Cup : ప్రపంచ క్రికెట్​లో భారత్‌కు సచిన్‌ తెందూల్కర్‌ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. టీమ్‌ ఇండియా తరఫున వేల పరుగులు, ఎన్నో వికెట్లు తీశాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో చాలా సందర్భాల్లో బ్యాటుతో, బంతితో ప్రత్యర్థులను వణికించాడు. అలానే కొన్ని మ్యాచుల్లో విఫలమ్యాడు కూడా. అయితే ఒక మ్యాచ్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో విఫలమైనప్పటికీ ఆ మ్యాచ్​లో హీరోగా నిలిచాడు. అదెలా అంటే?

ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే? - ఈ మ్యాచ్‌ వివరాలు తెలుసుకునేందుకు మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. 1993లో కోల్‌కతా, ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్​ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన హీరో కప్ సెమీఫైనల్లో ఈ సంఘటన చోటు చేసుకొంది. టీమ్​ఇండియా మొదట 195 పరుగులు చేసింది. ఇందులో మహ్మద్ అజారుద్దీన్​ 90 పరుగులతో అదరగొట్టాడు. కానీ సచిన్ మాత్రం కేవలం 15 పరుగులకే ఔట్​ అయ్యాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో 49 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 190/8. చేతిలో ఇంకా రెండు వికెట్లు ఉండగా, విజయానికి ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడు అజారుద్దీన్ ఊహించని విధంగా సచిన్‌కు బౌలింగ్‌ ఇచ్చాడు. అప్పటికి యంగ్‌ ప్లేయర్‌ సచిన్‌ మ్యాచ్‌ మొత్తంలో ఒక్క ఓవర్‌ కూడా వేయలేదు. అలాంటి సచిన్‌పై పెద్ద బాధ్యత పడింది.

అతడి బౌలింగ్​లో ఓ రన్‌ అవుట్‌ నమోదు అయింది. దీంతో దక్షిణాఫ్రికా చేతిలో ఒక వికెట్ మాత్రమే మిగిలి ఉంది. విజయానికి ఒక బంతికి నాలుగు పరుగులు చేయాలి. ఆ సమయంలో సచిన్ చివరి బంతి టైట్ లైన్ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేశాడు. అప్పుడు దక్షిణాఫ్రికాకు కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. అలా దక్షిణాఫ్రికా 193/9కి పరిమితం అయింది. భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.

సచిన్‌ ప్రదర్శనతోనే విజయం - ఈ ప్రదర్శనతో ఆ మ్యాచ్​లో సచిన్‌ హీరోగా నిలిచాడు. అతడు ఎక్కువ పరుగులు చేయకపోయినా, వికెట్ తీయకపోయినా బౌలింగ్ టైట్​గా వేసి హీరోగా నిలిచాడు. తద్వారా భారత జట్టు ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్​ తర్వాత సచిన్ రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు.

కోహ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్​లలో ధరించే సన్ గ్లాసెస్ ధర అంతా? - Kohli Oakley sunglasses Price

గ్వాలియర్​లో 14ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్​ మ్యాచ్- సచిన్ డబుల్ సెంచరీ చేసింది అక్కడే! - India Vs Bangladesh 1st T20

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.