ETV Bharat / snippets

సుప్రీంకోర్టు సిట్‌ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా: పవన్‌ కల్యాణ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Pawan_Kalyan_on_Supreme_Court_Verdict
Pawan Kalyan on Supreme Court Verdict (ETV Bharat)

Pawan Kalyan on Supreme Court Verdict: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ తెలిపారు. స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. కల్తీ నెయ్యి వినియోగం బయటకు వచ్చినప్పటి నుంచి సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారన్నారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో ప్రసాదం, అన్నప్రసాదాల్లో నాణ్యత లోపించిందని, అపవిత్ర చర్యలకు కారణమైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. గత పాలకమండలి నిర్ణయాలను సంస్కరిస్తామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.