ETV Bharat / spiritual

ఆ రాశివారికి వ్యాపారంలో చిన్నపాటి ఇబ్బందులు- శివారాధన శ్రేయస్కరం! - Horoscope Today - HOROSCOPE TODAY

Horoscope Today 5th October 2024 : 2024 అక్టోబర్ 5వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope
Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 4:19 AM IST

Horoscope Today 5th October 2024 : 2024 అక్టోబర్ 5వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజంతా సరదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులు కష్టించి పనిచేసి మొదలు పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. వ్యక్తిగతంగా జరిగిన కొన్ని సంఘటనలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికంగా మీరు ఆశించిన ప్రయోజనాలను అందుకుంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభాలున్నాయి. కీలకమైన వ్యవహారంలో ఖచ్చితమైన ప్రణాళికతో నడుచుకొని సత్ఫలితాలను పొందుతారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడుదొడుకులు కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. స్థానచలనం సూచన ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఆత్మన్యూనతా భావంతో సతమతమవుతుంటారు. ఎక్కడ తప్పు చేశారో అర్థంకాక ఆందోళనతో ఉంటారు. బద్దకాన్ని వీడి చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. కొన్ని ఘటనలు ఆందోళన కలిగించవచ్చు. సహచరుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ కలహాలు చికాకు పెడతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సన్నిహితులతో సంబంధాలు బలోపేతం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ సభ్యుల, సహచరుల అండతో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకోని అదృష్టం కలిసి రావడం వల్ల ఆనందంగా ఉంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెంచాలి. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు కళలు, సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంది. పనిలో మీరు చూపే నైపుణ్యం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు లేకపోవడం వల్ల నిరాశ చెందుతారు. కుటుంబంలో కలహాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. ఆరోగ్య పరిస్థితి గతం కంటే కొంత మెరుగ్గా ఉంది. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యల కారణంగా చేసే పనిలో శ్రద్ధ, ఏకాగ్రత లోపిస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల అశాంతిగా ఉంటారు. వ్యాపారంలో ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మీ కీర్తిప్రతిష్టలకు భంగం వాటిల్లే ఘటనలు జరగవచ్చు. ఖర్చులు అదుపు తప్పుతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఆపదలు తొలగిపోతాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంత కాలంగా వేధించిన ఆందోళనల నుంచి బయట పడతారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి చేసే పనిలో అనుకూలతలు ఉంటాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అధికంగా శ్రమించాల్సిన పనులకు ఈ రోజు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలలో పెద్దగా మార్పులేమీ ఉండవు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీదుర్గాదేవి ధ్యానం శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.