national

ETV Bharat / snippets

హరీశ్​రావు భుజానికి గాయం - ఏఐజీలో చికిత్స - పరామర్శకు వెళ్లిన నేతల అరెస్టు

BRS Leader Harish Rao Right Shoulder was Injured
BRS Leader Harish Rao Right Shoulder was Injured (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 1:31 PM IST

BRS Leader Harish Rao Right Shoulder was Injured :బీఆర్ఎస్ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తన భుజానికైన గాయానికి చికిత్స తీసుకునేందుకు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. సైబరాబాద్‌ సీపీ కార్యాలయం వద్ద గురువారం జరిగిన ఆందోళనలో పాల్గొన్న హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేసే సమయంలో ఆయనకు గాయమైంది. కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య సవాళ్ల నేపథ్యంలో శుక్రవారం హరీశ్‌రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హరీశ్‌రావును పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్‌ కవితను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. పోలీసుల అనుమతితో భుజం గాయానికి చికిత్స తీసుకోవడానికి హరీశ్‌రావు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details